Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాకెట్ శాస్త్రం లో ప్రముఖ శాస్త్రవేత్త మరియుగేలెక్టిక్ ఎనర్జీ వెంచర్స్ స్థాపకుడు శ్రీ సియాబులేలా జుజా తో సమావేశమైన ప్రధానమంత్రి

రాకెట్ శాస్త్రం లో ప్రముఖ శాస్త్రవేత్త మరియుగేలెక్టిక్ ఎనర్జీ వెంచర్స్ స్థాపకుడు శ్రీ సియాబులేలా జుజా తో సమావేశమైన ప్రధానమంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24వ తేదీ న జోహాన్స్ బర్గ్ లో ప్రసిద్ధ రాకెట్ శాస్త్రవేత్త మరియు గేలెక్టిక్ ఎనర్జి వెంచర్స్ యొక్క స్థాపకుడు, ఇంకా మేనేజింగ్ డైరెక్టరు శ్రీ సియాబులేలా జుజా తో సమావేశమయ్యారు.

 

చంద్రయాన్-3 మిశన్ సఫలం అయిన సందర్భం లో శ్రీ జుజా ప్రధాన మంత్రి కి అభినందనల ను తెలియ జేశారు. సాఫల్యం యొక్క ఖ్యాతి డిజిటల్ ఇండియా ది అని ఆయన అంటూ, భారతదేశం లో అమలు అవుతున్న తమ ప్రాజెక్టుల ను గురించి ప్రధాన మంత్రి కి వివరించారు.
 

శక్తి రంగం యొక్క భవిష్యత్తు మరియు దీర్ఘ కాలం పాటు మనుగడ లో నిలచేటటువంటి పరిష్కార మార్గాల ను అన్వేషించడాని కి సంబంధించిన అంశాలు కూడా వారి మధ్య చర్చ కు వచ్చాయి.

 

***