Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రష్యన్ ఫెడరేషన్.. రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియాలలో (2024 జూలై 08-10 మధ్య) ప్రధాని పర్యటన


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూలై 08-10 తేదీలలో రష్యన్ ఫెడరేషన్ సహా రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియాలో అధికారికంగా పర్యటిస్తారు.

   ఈ మేరకు రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానొం మేరకు 2024 జూన్ 8,9 తేదీల్లో ప్రధానమంత్రి మాస్కో సందర్శిస్తారు. ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన సాగే 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా దేశాధినేతలిద్దరూ రెండు దేశాల మధ్యగల బహుముఖ సంబంధాలను సమీక్షిస్తారు. అలాగే పరస్పర ప్రయోజనంగల సమకాలీన ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు.

   ఆ తర్వాత 2024 జూలై 09-10 తేదీల్లో ఆస్ట్రియా పర్యటనకు వెళ్తారు. కాగా, గడచిన 41 సంవత్సరాల్లో భారత ప్రధాని ఒకరు ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా అధ్యక్షుడు గౌరవనీయ అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్ సహా చాన్సలర్ మాననీయ కార్ల్ నెహమ‌ర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. అనంతరం భారత-ఆస్ట్రియా దేశాల వాణిజ్య ప్రముఖులతో సమావేశంలో ప్రధానమంత్రి, చాన్సలర్ ప్రసంగిస్తారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా మాస్కోతోపాటు ఆస్ట్రియాలోని వియన్నా నగరంలోనూ ప్రవాస భారత సమాజ సభ్యులతో సంభాషిస్తారు.