రశ్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
యూక్రేన్ లో ఉత్పన్నమైన స్థితి ని గురించి నేత లు ఇద్దరు చర్చించారు. రష్యా, యూక్రేన్ బృందాల మధ్య సంప్రదింపులు ఏ దశ లో ఉన్నదీ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వివరించారు. రష్యా కు మరియు యూక్రేన్ కు మధ్య సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. అవి వైరుధ్యం అంతాని కి దారి తీయగలవన్న ఆశ ను ఆయన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ కు మరియు యూక్రేన్ అధ్యక్షుడు శ్రీ వలొడిమిర్ జెలెంస్కీ కి మధ్య నేరు సంభాషణ జరిగితే ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రయాసల కు గొప్ప సహకారం లభించగలదు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించారు.
సుమీలో ఇంకా మిగిలిపోయిన భారతదేశ విద్యార్థుల సురక్షత, భద్రత ల విషయమై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన ను వెలిబుచ్చారు. భారతదేశ విద్యార్థుల తో పాటు పౌరుల ను ఖాళీ చేయించడాని కి నెలకొల్పుతున్న మానవీయ నడవాల కు సంబంధించి ప్రస్తుతం చేపడుతున్నటువంటి చర్యల ను గురించి అధ్యక్షుడు శ్రీ పుతిన్ ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు.
***