Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రథ యాత్ర సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రథ యాత్ర సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

“రథయాత్రను పురస్కరించుకొని మీకు అందరికీ నా ఆత్మీయమైన శుభకామనలు. ఆ జగన్నాథుడు తన ఆశీస్సులను ప్రతి ఒక్కరిపైనా వర్షించుగాక.

భగవాన్ జగన్నాథుని ఆశీర్వాదాలు పల్లెల అభివృద్ధికి, పేదలు- వ్యవసాయదారుల శ్రేయానికి దారితీసి, భారతదేశం పురోగతిలో కొత్త శిఖరాలకు చేరుకొనేటట్లు చేయుగాక” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.