Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా 100వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసిన ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఈ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా 100వ వార్షికోత్సవ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు. ఈ సందర్భంగా న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటైన ఒక సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, స్వామి పరమహంస యోగానంద ను అభినందించారు. స్వామి గారు చూపిన మార్గం ముక్తి గురించి కాదని, అది ‘అంతర్ యాత్ర’కు సంబంధించినదని ప్రధాన మంత్రి అన్నారు.

స్వామి పరమహంస యోగానంద తన సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం భారత దేశాన్ని వదలి వెళ్లారని, అయినప్పటికీ ఆయన భారతదేశంతో సంబంధాలను ఎల్లప్పుడూ కొనసాగించారని శ్రీ మోదీ అన్నారు.

భారతదేశ ఆధ్యాత్మిక వాదమే భారతదేశపు శక్తి అని, ఆధ్మాత్మిక వాదాన్ని సైతం మతంతో కొంత మంది ముడిపెట్టడం దురదృష్టకరమని, ఇవి రెండూ వేరు వేరని ప్రధాన మంత్రి చెప్పారు.

***