ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీ నాడు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంశం పై జరిగిన మొట్టమొదటి ఐక్య రాజ్య సమితి సాధారణ సభ ఉన్నత స్థాయి సమావేశం లో ప్రసంగించారు.
ఆయన తన వ్యాఖ్యల లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ను సాధించడం కోసం భారతదేశం తీసుకొన్న సాహస నిర్ణయాల ను ప్రముఖం గా ప్రస్తావించారు. ఆరోగ్యాని కి అర్థం ఒక్క రోగాల బారిన పడకుండా ఉండటం మాత్రమే కాదు అని ఆయన అన్నారు. స్వస్థ జీవనం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కు. దీని కి బాధ్యత ప్రభుత్వాల ది, అవే దీని కి పూచీ పడాలి అని వివరించారు.
ఈ అంశం లో భారతదేశం సమగ్ర వైఖరి ని అనుసరిస్తోందని, ఆరోగ్య సంరక్షణ సంబంధిత నాలుగు ప్రధాన స్తంభాల ను ఏర్పాటు చేసేందుకు అది పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. వాటిలో..
– ముందు జాగ్రత్త చర్యల తో కూడిన ఆరోగ్య సంరక్షణ
– తక్కువ ఖర్చు లో స్వాస్థ్య సంరక్షణ
– సరఫరా దిశ గా మెరుగుదల లు
– ఉద్యమ తరహా లో ఆచరణ ..
ఇవి భాగం గా ఉన్నాయని ప్రధాన మంత్రి తెలిపారు.
యోగ, ఆయుర్వేదం, దేహ దారుఢ్యం మరియు 1,25,000కు పైగా వెల్‌నెస్ సెంటర్ ల నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం ముందు జాగ్రత్త చర్యల తో కూడిన ఆరోగ్య సంరక్షణ ను ప్రోత్సహించేందుకు అండ గా నిలచినట్లు, అంతేకాక మధుమేహం, రక్తపోటు, మానసికం గా కుంగుబాటు తదితర జీవన శైలి వ్యాధుల నియంత్రణ లో సైతం ఈ శ్రద్ధ తోడ్పడినట్లు ప్రధాన మంత్రి వివరించారు. ఇ-సిగరెట్ లను నిషేధించడం, స్వచ్ఛ్ భారత్ ప్రచార ఉద్యమం ద్వారా ఇతోధిక చైతన్యాన్ని కలుగ జేయడం, టీకాల ను ఇప్పించే కార్యక్రమం వంటివి కూడా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం కోసం వాటి వంతు గా తోడ్పడ్డాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘తక్కువ ఖర్చు లో ఆరోగ్య సంరక్షణ కు పూచీ పడేందుకు భారతదేశం ప్రపంచం లో అత్యంత భారీ ఆరోగ్య బీమా పథకం అయిన ఆయుష్మాన్ భారత్ ను ప్రవేశపెట్టింది. ఈ పథకం లో భాగం గా 500 మిలియన్ పేదల కు ఒక్కో సంవత్సరానికి 5,00,000 రూపాయల వరకు (7,000 యుఎస్ డాలర్ కు పైబడి) విలువైన ఉచిత రోగ చికిత్స సదుపాయాన్ని అందించడమైంది. 800 రకాల కు పైగా కీలక ఔషధాలు తక్కువ ధరల కే 5000కు పైబడిన ప్రత్యేక ఔషధ దుకాణాల లో దొరుకుతున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
నాణ్యత కలిగిన వైద్య విద్య, ఇంకా వైద్యాని కి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కి భారతదేశం అనేక చరిత్రాత్మకమైన నిర్ణయాల ను తీసుకొన్న సంగతి ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఆరోగ్య రంగం లో ఉద్యమ తరహా జోక్యాల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, తల్లి కి, బిడ్డ కు పౌష్టిక ఆహారాన్ని అందించడం లో నేశనల్ న్యూట్రిశన్ మిశన్ పోషిస్తున్న పాత్ర ను గురించి వెల్లడించారు. క్షయ వ్యాధి ని 2030వ సంవత్సరం కల్లా నిర్మూలించాలన్నది ప్రపంచానికంతటికీ నిర్దేశించిన లక్ష్యం కాగా అంతకు అయిదు సంవత్సరాల ముందుగానే అంటే 2025వ సంవత్సరం కల్లా ఆ వ్యాధి ని నిర్మూలించాలని భారతదేశం కంకణం కట్టుకొందని ఆయన చెప్పారు. వాయు కాలుష్యం కారణం గాను మరియు పశువుల ద్వారాను వ్యాపించే రోగాల బారి న పడకుండా ఉండడం కోసం చేపడుతున్న ప్రచార ఉద్యమాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించి, ఇవి కీలకమైన ప్రాముఖ్యం గలవి అని పేర్కొన్నారు.
భారతదేశం యొక్క ప్రయత్నాలు దాని సరిహద్దుల కు మాత్రమే పరిమితం కావు. భారతదేశం అనేక ఇతర దేశాల కు, ప్రత్యేకించి ఆఫ్రికా ఖండం లోని దేశాల కు టెలి- మెడిసిన్ మార్గం లో తక్కువ ఖర్చు తో కూడిన ఆరోగ్య సంరక్షణ ను అందించేందుకు తోడ్పడిందని వివరించారు.
ఈ సమావేశాన్ని ‘‘యూనివర్సల్ హెల్త్ కవ్ రిజ్: మూవింగ్ టుగెదర్ టు బిల్డ్ ఎ హెల్థియర్ వరల్డ్’’ అనే ఇతివృత్తం తో నిర్వహించడమైంది. యూనివర్సల్ హెల్థ్ కవ్ రిజ్ (యుహెచ్‌సి) దిశ గా పురోగతి ని వేగవంతం చేయాలన్నదే ఈ సమావేశం యొక్క ధ్యేయం గా ఉంది. 2030వ సంవత్సరం కల్లా యూనివర్సల్ హెల్త్ కవ్ రిజ్ లక్ష్య సాధన దిశ గా వేగవంతం చేయడం కోసం ప్రభుత్వాల మరియు దేశాల అధినేతల వద్ద నుండి రాజకీయ వచన బద్ధత ను కూడగట్టడం కోసం అంతర్జాతీయ సమాజాన్ని ఏకీకృతం చేయడమే ఈ సమావేశాల ఉద్దేశ్యం.
దాదాపు గా 160 ఐరాస సభ్యత్వ దేశాలు ఈ సమావేశం లో వాటి ఆలోచనల ను వెల్లడించనున్నాయి.
అందరి కి తక్కువ ఖర్చు తో కూడుకొన్నటువంటి, సురక్షితం అయినటువంటి, సమర్ధం గా పని చేసేటటువంటి, నాణ్యత కలిగినటువంటి మరియు అత్యవసరమైనటువంటి ఆరోగ్య సంరక్షణ సేవల ను అందుబాటు లోకి తీసుకు రావడం, ఇంకా ఫైనాన్శల్ రిస్క్ ప్రొటెక్షన్ తో పాటు యూనివర్సల్ హెల్త్ కవ్ రిజ్ ను 2030వ సంవత్సరం కల్లా సాధించాలని 2015వ సంవత్సరం లో ప్రభుత్వాల అధిపతులు మరియు దేశాల అధినేత లు ఒక సంకల్పాన్ని తీసుకొన్నారు.
******
At the @UN, PM @narendramodi also addressed a session on Universal Health Coverage. pic.twitter.com/pn6iI4erjK
— PMO India (@PMOIndia) September 23, 2019
My remarks on health sector and ensuring good quality healthcare to all. https://t.co/KVF24n9rum
— Narendra Modi (@narendramodi) September 23, 2019