Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు, భూటాన్ కు చెందిన రాయల్ సివిల్ సర్వీస్ కమిషన్ కు మధ్య అవగాహనాపూర్వక ఒప్పంద పత్రానికి మంత్రిమండలి ఆమోదం


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు పి ఎస్ సి) కి, భూటాన్ కు చెందిన రాయల్ సివిల్ సర్వీస్ కమిషన్ (ఆర్ సి ఎస్ సి) కి మధ్య అవగాహనాపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాల ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఆర్ సి ఎస్ సి, యుపి ఎస్ సి ల మధ్య ఇప్పుడు ఉన్న సంబంధాలను ఈ ఎమ్ ఒ యు పటిష్టపరచనుంది. ఇది నియామకాల విషయం లో ఇరు పక్షాలు వాటి అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడానికి వీలు కల్పించగలదు.

ఉమ్మడి ఆదార్శాలను కలిగివున్న ఉభయ దేశాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల మధ్య సంస్ధాగతమైన అనుసంధానాన్ని అభివృద్ధి చేయడానికి యుపి ఎస్ సి, ఆర్ సి ఎస్ సి ల మధ్య ముసాయిదా ఎమ్ ఒ యు పై సంతకాలు జరగనున్నాయి. సహకరించుకొనే అంశాలు ఈ క్రింద పేర్కొన్న విధంగా ఉండబోతున్నాయి :

అ) నియామకాలు, ఎంపిక, ఒక దేశపు రీసోర్స్ పర్సన్ లను మరొక దేశానికి ఇచ్చి పుచ్చుకోవడం, శిక్షణా కార్యక్రమాల వంటి వాటి ద్వారా ఇరు పక్షాల అధికారులకు, సిబ్బందికి వృత్తి పరమైన నైపుణ్యాలను అందించడం వగైరా సివిల్ సర్వీస్ విషయాలలో అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని పంచుకొంటారు.

ఆ) పరీక్షా ప్రక్రియలలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐ టి) వినియోగంలోను, కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షల నిర్వహణలోను ప్రావీణ్యాన్ని పంచుకొంటారు; కేసులను శరవేగంగా పరిశీలన జరిపి పరిష్కరించేందుకు, మెరిట్ బేస్ డ్ స్టాఫింగ్ సిస్టమ్ ను నిర్మించేందుకు ఏక గవాక్ష వ్యవస్థ తాలూకు ప్రావీణ్యాన్ని పంచుకొంటారు.

ఇ) ఆడిట్ లోను, ఇంకా ప్రాతినిధ్య అధికారాలతో కూడిన ఉద్యోగాల భర్తీలోను వివిధ ప్రభుత్వ సంస్థలు అవలంబించే విధానాలలో ఇరు సంస్థలకు (యుపి ఎస్ సి, ఆర్ సి ఎస్ సి లకు) ఉన్న ప్రావీణ్యాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకొంటారు.

ఈ) రికార్డుల నిర్వహణ, ఇంకా పాత రికార్డులను దాచి ఉంచే, ప్రదర్శించే విధానాల డిజిటలీకరణ లోను ఇరు సంస్థల ప్రావీణ్యాన్ని పంచుకొంటారు.

పూర్వ రంగం :

కెనడా మరియు భూటాన్ లకు చెందిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ లతోను యుపి ఎస్ సి గతంలో అవగాహనపూర్వక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది.