Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యూనిఫైడ్ టారిఫ్ ను అమలు లోకితీసుకువచ్చినట్లు ప్రకటించిన పిఎన్ జిఆర్ బి; ఇది సహజ వాయువు రంగం లో ఎప్పటి నుండోఎదురు చూస్తున్నటువంటి సంస్కరణ


సహజ వాయువు రంగం లో ఎప్పటి నుండో ఎదురు చూస్తూ వస్తున్నటువంటి సంస్కరణ అయిన యూనిఫైడ్ టారిఫ్ ను అమలు లోకి తీసుకు వచ్చినట్లు పెట్రోలియ్ ఎండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పిఎన్ జిఆర్ బి) తెలియ జేసింది.

శక్తి మరియు సహజ వాయువు రంగం లో ఇది ఒక చెప్పుకోదగినటువంటి సంస్కరణ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు.

పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురి అనేక ట్వీట్ లలో దేశం యొక్క అన్ని ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి జరగాలన్న ఉద్దేశ్యాని కి అనుగుణం గా పిఎన్ జిఆర్ బి సహజ వాయువు రంగం లో యూనిఫైడ్ టారిఫ్ కార్యాచరణ ను మొదలుపెట్టింది. సహజ వాయువు రంగం లో ఎప్పటి నుండో ఎదురు చూస్తూ వస్తున్న సంస్కరణ ఇది అని పేర్కొన్నారు.

ఈ టారిఫ్ వ్యవస్థ ‘వన్ నేశన్-వన్ గ్రిడ్-వన్ టారిఫ్’ నమూనా ను అందుకోవడం లో భారతదేశాని కి సాయపడుతుంది. అంతేకాకుండా దూర ప్రాంతాల లో గ్యాస్ బజారుల నుప్రోత్సాహాన్ని కూడా అందిస్తుందని శ్రీ హర్ దీప్ సింహ్ పురి తెలియ జేశారు.

కేంద్ర మంత్రి ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ –

‘‘శక్తి మరియు సహజ వాయువు రంగం లో చెప్పుకోదగినటువంటి సంస్కరణ’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*****

DS/ST