Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యువ సాధికారత దిశగా మున్ముందుకు… క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ సూచీ వాస్తవాలను వెల్లడించింది: ప్రధాని


 

క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ సూచీలో కెనడా, జర్మనీల కన్నా ముందంజలో నిలిచి రెండో ర్యాంకును భారత్ సొంతం చేసుకోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘ఇదెంతో ఉత్సాహాన్నిచ్చే అంశం. దశాబ్ద కాలంగా యువతను నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం ద్వారా వారిని శక్తిమంతులుగా మలచడానికి మా ప్రభుత్వం కృషిచేసింది. ఫలితంగా వారు స్వావలంబన సాధించి సంపదను సృష్టించేలా ఎదిగారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. శ్రేయస్సు, యువత సాధికారత దిశగా మనం మరింతగా ముందుకు సాగుతున్న తరుణంలో క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ సూచీ వెల్లడించిన అంశాలు ఎంతో విలువైనవని ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు.

క్యూఎస్ క్వాక్వరెల్లి సైమండ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శ్రీ నుజియో క్వాక్వరెల్లి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘ఇది హృదయాన్ని హత్తుకునే విషయం!

దశాబ్ద కాలంగా యువతను నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం ద్వారా వారిని శక్తిమంతులుగా మలచడానికి మా ప్రభుత్వం కృషిచేసింది. ఫలితంగా వారు స్వావలంబన సాధించి సంపదను సృష్టించేలా ఎదిగారు. సాంకేతిక శక్తిని కూడా ఉపయోగించి భారత్ ను ఆవిష్కరణ, వ్యవస్థాపకతల నిలయంగా మార్చాం.

క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ సూచీ అనేక వాస్తవాలను వెల్లడించింది. శ్రేయస్సు, యువత సాధికారత దిశగా మనం ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇవి ఎంతగానో విలువైనవి. ’’ 

 

***