Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘యువ సంగం’ రెండోదశకు నమోదు చేసుకోండి: యువతకు ప్రధానమంత్రి పిలుపు


   యువ సంగం రెండోదశకు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ ట్వీట్‌ను యువతరంతో పంచుకుంటూ పంపిన సందేశంలో:

“యువ సంగం తొలిదశ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల అద్భుత వీడియోలు, చిత్రాలను నేను చూశాను. ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తిని ఈ ఆదానప్రదానాలు మరింత బలోపేతం చేస్తాయి. ఈ మేరకు యువతరం రెండోదశలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోవాలి” అని ప్రధానమంత్రి సూచించారు.