యువరాజు కరీమ్ అగాఖాన్ IV మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలియజేశారు. ఆయన సేవకు, ఆధ్యాత్మికతకు జీవితాన్ని అంకితం చేసిన దార్శనికుడని పీఎం ప్రశంసించారు. ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, మహిళాసాధికారత తదితర అంశాల్లో ఆయన చేసిన కృషిని కొనియాడారు.
ఎక్స్ లో ప్రధాని చేసిన పోస్టు:
‘‘యువరాజు కరీమ్ అగాఖాన్-IV మరణం తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. సేవకు, ఆధ్యాత్మికతకు జీవితాన్ని అంకితం చేసిన దార్శనికుడు. ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత అంశాల్లో ఆయన చేసిన కృషి ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయనతో జరిపిన సంభాషణలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆయన కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది అనుచరులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.’’
Deeply saddened by the passing of His Highness Prince Karim Aga Khan IV. He was a visionary, who dedicated his life to service and spirituality. His contributions in areas like health, education, rural development and women empowerment will continue to inspire several people. I… pic.twitter.com/ef2lMIQ6H0
— Narendra Modi (@narendramodi) February 5, 2025