యువజన వ్యవహారాలు మరియు క్రీడల రంగంలో ద్వైపాక్షిక సహకారం కోసం 7.4.1999 నాడు కతర్ తో ఒక అవగాహనపూర్వక ఒప్పందం పత్రం (ఎమ్ ఒ యు) పైన, ఇంకా 5.6.2016 నాడు ది ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎమ్ ఒ యు పైనా సంతకాలు జరిగిన విషయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ మరియు శిక్షణ సంబంధ విజ్ఞాన రంగాలలో ప్రావీణ్యాన్ని మరింతగా పెంపొందించుకోవడంలో ఈ ఎమ్ ఒ యు తోడ్పడగలదు. ఇది క్రీడాకారుల కులం, వర్గం, ప్రాంతం, మతం మరియు లింగభేదాలకు అతీతంగా అందరికీ సమానంగా వర్తించనున్నది. తద్వారా అంతర్జాతీయ ఆటల పోటీలలో మన క్రీడాకారుల ప్రదర్శన మెరుగుపడగలుగుతుంది. అంతే కాకుండా, భారతదేశం మరియు కతర్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతాయి కూడా.