ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం,యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పబ్లిక్ సర్విస్ కమిషన్ ఆఫ్ మారిషస్ మధ్య అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ఆమోదం తెలిపింది.
ఈ అవగాహనా ఒప్పందం యుపిఎస్సికి, మారిషస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాలను బలోపేతం చేయనుంది. రిక్రూట్మెంట్ వ్యవహారాలలో ఇరుపక్షాలూ తమ అనుభవాన్ని, నైపుణ్యాలను పంచుకోవడానికి ఇది దోహదపడుతుంది.
ఈ అవగాహనా ఒప్పందం ఇరు దేశాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మధ్య వ్యవస్థాగత లింకేజ్‌ని అభివృద్ధి చేస్తుంది. మారిషస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యుపిఎస్సిల మధ్య సహకారానికి , బాధ్యతలకు సంబంధించిన అవకాశాలను ఇది నిర్వచిస్తుంది. ఇరు పక్షాలు ఈ కింది అంశాలలో పరస్పరం సహకరించుకోనున్నాయి.
పబ్లిక్ సర్వీస్ రిక్రూట్మెంట్, సెలక్షన్‌కు సంబంధించి ఆధునిక వైఖరికి సంబంధించి, ప్రత్యేకించి పబ్లిక్ సర్వీస్ కమిషన్, యుపిఎస్సిల విధుల విషయంలో తమ తమ అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడం,
గోప్యత పరిధికిందికి రాని పత్రాలు, మాన్యువల్స్, పుస్తకాలు, ఇతర నైపుణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం,
రాత పరీక్షలకు సిద్ధం కావడానికి సంబంధించి,కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ పరీక్షలు, ఆన్లైన్ పరీక్షల నిర్వహణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి)వినియోగం విషయంలో నైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకోవడం,
దరఖాస్తులను వేగంగా పరిశీలించగం, వాటిని సత్వరం పరిష్కరించడానికి సంబంధించి సింగిల్ విండో వ్యవస్థ ద్వారా తమ తమ అనుభవాలను పంచుకోవడం,
పరీక్షల వ్యవస్థతో ముడిపడిన రొటీన్‌గా ఉండే వివిధ ప్రక్రియలకు సంబంధించి నైపుణ్యాన్ని తమ తమ అనుభవాలను పంచుకోవడం,
అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఆయా పక్షాల మాండేట్‌కు అనుగుణంగా కేంద్ర కార్యాలయాలు, ఆయా సెక్రటేరియట్లకు షార్ట్ అటాచ్మెంట్ ల ద్వారా శిక్షణ,
(vii) డెలిగేటెడ్ అధికారాల కింద వివిధ ప్రభుత్వ విభాగాలు పోస్టుల భర్తీలో అనుసరించే ఆడిట్ ప్రక్రియలు, విధానాలకు సంబంధించిన విధివిధానాలు, అనుభవాలను పరస్పరం పంచుకోవడం
నేపథ్యం…
గతంలో యుపిఎస్సి కెనడా, భూటాన్‌ల పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. కెనడాతో కుదిరిన అవగాహనా ఒప్పందం 15.3.2011 నుంచి 14.3.2014 వరకు అమలులో ఉంది. రాయల్ సివిల్ సర్వీస్ కమిషన్ (ఆర్సిఎస్సి), భూటాన్‌తో యుపిఎస్సి 2005 నవంబర్ 10 న మూడు సంవత్సరాల కాలానికి అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది. దీనిని 2011 సెప్టెంబర్ 9న మరో మూడు సంవత్సరాలకు తిరిగి పొడిగించారు. అది 2014 సెప్టెంబర్8న గడువు తీరిపోయింది. ఈ అవగాహనా ఒప్పందాలకు అనుగుణంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్సిఎస్సి,భూటాన్ అధికారులకు అటాచ్మెంట్లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. ఇటీవల యుపిఎస్సి, భూటాన్ ఆర్సిఎస్సికి మధ్య మూడోసారి 29.5.2017న మూడు సంవత్సరాల కాలానికి ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి.