Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీ బైడెన్ తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి


యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న, అంటే సోమవారం నాడు, టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

నేత లు ఇరువురు వారి వారి దేశాల లో కోవిడ్-19 స్థితి ని గురించి, ప్రస్తుత కోవిడ్-19 రెండో వేవ్ ను అదుపు లో ఉంచడం కోసం ప్రజల కు టీకా మందు ను ఇప్పించే కార్యక్రమాన్ని శీఘ్రతరం చేయడం,  గుణదోష పరీక్ష సంబంధి మందుల సరఫరా ను, వ్యాధి చికిత్స శాస్త్ర సంబంధి సేవల ను, ఆరోగ్య సంరక్షణ సంబంధి సామగ్రి సరఫరా ను బలపరచడం సహా భారతదేశం సాగిస్తున్న ప్రయాసల ను గురించి చర్చించారు.  

అధ్యక్షుడు శ్రీ బైడెన్ భారతదేశం తో కలసి పనిచేయగలమని ప్రకటించారు.  చికిత్స శాస్త్ర సంబంధి సేవ లు, వెంటిలేటర్ ల వంటి వనరుల ను త్వరగా రంగం లోకి దింపడానికి భారతదేశం చేస్తున్న ప్రయాసల లో, కోవిశీల్డ్ టీకా మందుల ను తయారు చేయడానికి అవసరమైన ముడిపదార్థాల కు సంబంధించిన వనరుల ను గుర్తించడం లో భారతదేశానికి ఊతాన్ని ఇచ్చేందుకు యునైటెడ్ స్టేట్స్ కంకణం కట్టుకుందని ఆయన స్పష్టం చేశారు.

సాయపడటానికి, తోడ్పాటు ను అందించడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హృద‌యపూర్వక ప్రశంస ను వ్యక్తం చేశారు.  వ్యాక్సీన్ మైత్రి మాధ్యమం ద్వారాను, కోవ్యాక్స్, క్వాడ్ వ్యాక్సీన్ కార్యక్రమాల ద్వారా ను ప్రపంచం అంతటా కోవిడ్-19 ని నిరోధించడానికి భారతదేశం వచనబద్ధురాలు అయిందని ఆయన ప్రస్తావించారు.  కోవిడ్-19 కి సంబంధించినటువంటి చికిత్స శాస్త్ర సంబంధి సేవల తో పాటు మందుల తయారీ కి, టీకా మందు ల తయారీ కి అవసరమైన ముడి పదార్థాల, ఉత్పాదకాల సరఫరా చైన్ ల ను సరళమైన విధం గా అందుబాటు లో ఉంచేందుకు సన్నద్ధం కావలసిన అవసరం ఎంతయినా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.

కోవిడ్-19 మహమ్మారి నివారణ లో నిమగ్నం కావడం కోసం వ్యాక్సీన్ ను అభివృద్ధిపరచడం లో, వ్యాక్సీన్ ను సరఫరా చేయడం లో భారతదేశం- యుఎస్ భాగస్వామ్యానికి గల అంతర్గత శక్తి ని ఇద్దరు నేత లు దృఢపరచారు.  ఈ రంగం లో చేసే కృషి లో సన్నిహిత సమన్వయాన్ని, సహకారాన్ని కొనసాగించవలసింది గా తమ సంబంధిత అధికారులను వారు ఆదేశించారు.

మందుల ను, టీకా మందు లను తక్కువ ఖర్చు లో, వెంటనే అభివృద్ధి చెందుతున్న దేశాల కు అందేలా చూసేందుకు టిఆర్ఐపిఎస్ తాలూకు ఒప్పందం నియమాల లో సడలింపు ను ఇచ్చే అంశం పై భారతదేశం డబ్ల్యు టిఒ లో అభివృద్ధి చెందుతున్న దేశాల కు చొరవ ను కనబరచిన సంగతి ని కూడా అధ్యక్షుడు శ్రీ బైడెన్ దృష్టి కి ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీసుకు వచ్చారు.
 
క్రమం తప్పక సంప్రదించుకొంటూ ఉండాలని ఉభయ నేత లు సమ్మతించారు.

 

***