Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యునైటెడ్ నేశన్స్వరల్డ్ జియోస్పేశల్ ఇంటర్ నేశనల్ కాంగ్రెస్ ను ఉద్ధేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

యునైటెడ్ నేశన్స్వరల్డ్ జియోస్పేశల్ ఇంటర్ నేశనల్ కాంగ్రెస్ ను ఉద్ధేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక వీడియో సందేశం మాధ్యమం ద్వారా యునైటెడ్ నేశన్స్ వరల్డ్ జియోస్పేశల్ ఇంటర్ నేశనల్ కాంగ్రెసు ను ఉద్దేశించి ప్రసంగించారు.

అంతర్జాతీయ ప్రతినిధుల కు ప్రధాన మంత్రి స్వాగతం చెబుతూ, ‘‘మనం కలిసికట్టు గా మన భవిష్యత్తు ను నిర్మించుకొంటున్న క్రమం లో భారతదేశం లోని ప్రజలు ఈ చారిత్రిక సందర్భం లో మీకు ఆతిథేయి గా ఉన్నందుకు సంతోషిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ సమావేశం హైదరాబాద్ లో జరుగుతున్నందుకు ప్రధాన మంత్రి ప్రసన్నత ను వ్యక్తం చేస్తూ, ఈ నగరం తన సంస్కృతి కి, అన్న పానాదులకు, ఆతిథ్యానికి మరియు హై టెక్ విజన్ కు ప్రసిద్ధి చెందింది అని పేర్కొన్నారు.

ఈ సమావేశాని కి ఇతివృత్తం గా తీసుకొన్నటువంటి ‘జియో ఎనేబ్లింగ్ ది గ్లోబల్ విలేజ్: నో వన్ శుడ్ బి లెఫ్ట్ బిహైండ్అనే అంశాన్ని భారతదేశం గడిచిన కొన్ని సంవత్సరాలలో చేపట్టిన చర్యల రూపం లో గమనించవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మేం అంత్యోదయ యొక్క దృష్టికోణం తో కృషి చేస్తున్నాం. ఇక్కడ అంత్యోదయ అంటే అభివృద్ధి వరుస లో చిట్ట చివరి స్థానం లో ఉన్న వ్యక్తి ని సైతం మిశన్ మోడ్ లో సశక్తం చేయడం అని అర్థం’’ అని ఆయన అన్నారు. బ్యాంకింగ్ సదుపాయాని కి ఆవల ఉండిపోయినటువంటి 450 మిలియన్ ప్రజల ను బ్యాంకింగ్ సౌకర్యం పరిధి లోకి తీసుకురావడమైంది. ఈ 450 మిలియన్ సంఖ్య అనేది యుఎస్ఎ జనాభా కంటే కూడా అధికం. మరి అంతే కాకుండా 135 మిలియన్ ప్రజల కు బీమా సౌకర్యాన్ని సమకూర్చడం జరిగింది. ఈ 135 మిలియన్ అనే సంఖ్య ఫ్రాన్స్ లోని జనాభా కంటే సుమారు రెండింత లు అని ప్రధాన మంత్రి వివరించారు. పారిశుద్ధ్యం సంబంధిత సదుపాయాల ను 110 మిలియన్ కుటుంబాల కు కల్పించడమైంది; మరియు నల్లా ల ద్వారా తాగునీటి సరఫరా సౌకర్యాన్ని 60 మిలియన్ కు పైగా కుటుంబాల కు అందించడమైంది. సమాజం లో ఏ ఒక్కరూ తగిన సౌకర్యాల కు నోచుకోకుండా ఉండిపోకూడదని భారతదేశం పాటుపడుతోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

సాంకేతిక విజ్ఞానం మరియు ప్రతిభ.. ఈ రెండు అంశాలు భారతదేశం యొక్క అభివృద్ధి యాత్ర లో కీలక భూమిక ను పోషిస్తున్నాయి. సాంకేతిక విజ్ఞానం తన తో పాటు పరివర్తన ను వెంటబెట్టుకు వస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. ఉదాహరణ కు తీసుకొంటే జెఎఎమ్ (జన్ ధన్ ఖాతా, ఆధార్, మొబైల్) త్రయం 800 మిలియన్ ప్రజల కు సంక్షేమ ప్రయోజనాల ను అంతరాయానికి తావు ఉండనటువంటి విధం గా అందించింది. అంతేకాకుండా ప్రపంచంలోకెల్లా అతి భారీ స్థాయి లో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమాని కి ఊతం గా నిలచినటువంటి ఒక టెక్నికల్ ప్లాట్ ఫార్మ్ ను కూడా అందించింది అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం లో, సాంకేతిక విజ్ఞానం అనేది ఏ వర్గాన్నో వదిలివేయడానికి పనికొచ్చే ఒక సాధనం గా కాక అన్ని వర్గాలను కలుపుకొని పోయేటటువంటి ఒక సాధనం గా ఉంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సమాజం లో అన్ని వర్గాల ను ఉమ్మడి గా కలుపుకొని పోవడం తో పాటు ప్రగతి ని సాధించడానికి జియో స్పేశల్ టెక్నాలజీ ఒక ముఖ్యమైన పాత్ర ను పోషిస్తున్న సంగతి ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. స్వామిత్వ మరియు గృహ నిర్మాణం వంటి పథకాల లో సాంకేతిక విజ్ఞానం యొక్క పాత్ర, ఇంకా సంపత్తి యాజమాన్యం మరియు మహిళల స్వశక్తీకరణ వంటి విషయాల లో సిద్ధించిన ఫలితాలు ఐక్య రాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్ డిజి స్ ) అయినటువంటి పేదరికం మరియు మహిళలు పురుషుల మధ్య సమానత్వం లపై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసరింప జేశాయని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. జియో స్పేశల్ టెక్నాలజీ ద్వారా పీఎమ్ గతిశక్తి మాస్టర్ ప్లాను ను బలోపేతం చేయడం జరుగుతోందని, అది డిజిటల్ ఓశన్ ప్లాట్ ఫార్మ్ కు సమానమైందని ఆయన అన్నారు. భారతదేశాని కి ఇరుగుపొరుగున ఉన్న ప్రాంతాల లో కమ్యూనికేశన్ సౌకర్యం కోసం దక్షిణ ఏశియా ఉపగ్రహాన్ని ఉదాహరణ గా ప్రధాన మంత్రి పేర్కొంటూ, భారతదేశం ఇప్పటికే జియో స్పేశల్ టెక్నాలజీ యొక్క లాభాల ను పంచుకొనే రంగం లో ఒక నిదర్శనాన్ని నెలకొల్పిందన్నారు.

భారతదేశం సాగిస్తున్న ప్రయాణం లో రెండో ప్రధానాంశం గా ఉన్నటువంటి ప్రతిభ యొక్క భూమిక ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ‘‘భారతదేశం ఒక యువ దేశం గా ఉంది, భారతదేశం లో నూతన ఆవిష్కరణ ల భావన ప్రబలం గా ఉంది’’ అని పేర్కొన్నారు. ప్రపంచం లో అగ్రగామి స్టార్ట్ అప్ హబ్స్ లో ఒకటి గా భారతదేశం ఉందని, భారతదేశం లో 2021వ సంవత్సరం తరువాతి నుంచి యూనికార్న్ హోదా ను సాధించిన స్టార్ట్ అప్స్ సంఖ్య దాదాపు గా రెండింత లు అయిపోవడం భారతదేశం యువత యొక్క ప్రతిభ కు ప్రమాణం గా ఉందని కూడా ఆయన వివరించారు.

నూతనమైన విషయాన్ని ఆవిష్కరించేటటువంటి స్వేచ్ఛ అనేది అతి ముఖ్యమైన స్వాతంత్ర్యం లలో ఒకటి అని ప్రధాన మంత్రి అన్నారు. మరి దీనిని జియోస్పేశల్ సెక్టర్ కోసం సునిశ్చితం చేయడమైందని ఆయన అన్నారు. జియో స్పేశల్ డేటా ను సేకరించే, ఆవిష్కరించే, డిజిటలీకరించే మార్గాల ను ప్రస్తుతం ప్రజాస్వామ్యీకరించడమైందని ఆయన అన్నారు. ఈ సంస్కరణలతో పాటు గా డ్రోన్ సెక్టర్ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడమైంది; అంతేకాక ప్రైవేట్ భాగస్వామ్యాని కి అనువు గా అంతరిక్ష రంగాన్ని తెరవడం తో పాటు భారతదేశం లో 5జి ని ప్రవేశపెట్టడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభిప్రాయం లో, ప్రతి ఒక్కరి ని కలుపుకొని పోవడం లో కోవిడ్ 19 మహమ్మారి మనల ను అప్రమత్తం చేసింది అని చెప్పుకోవచ్చు. ఏదయినా సంకటం తలెత్తిన కాలం లో ఒకరు మరొకరి కి సాయపడడం కోసం అంతర్జాతీయ సముదాయం ఒక సంస్థాగత దృష్టికోణాన్ని అవలంబించవలసిన అవసరం ఉంది అని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఐక్య రాజ్య సమితి వంటి ప్రపంచ సంస్థ ప్రపంచంలోని ప్రతి రంగం లో వనరుల ను అభివృద్ధి ని వరుస లోని కడపటి వ్యక్తి వరకు తీసుకుపోవడం లో నాయకత్వాన్ని అందించగలుగుతాయి’’ అని ఆయన అన్నారు. జల వాయు పరివర్తన ను ఎదిరించి పోరాటం జరపడం లో పరామర్శ, డబ్బు సహా అన్ని విధాలైన సహాయం మరియు సాంకేతిక విజ్ఞ‌ానం బదలాయింపు అనేవి ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. మన ధరణి ని కాపాడుకోవడానికి సర్వోత్తమ అభ్యాసాల ను పరస్పరం వెల్లడించుకోవచ్చు అంటూ ఆయన సలహా ను ఇచ్చారు.

జియో స్పేశల్ టెక్నాలజీ ఇవ్వజూపే అనంతమయిన సంభావనల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఆ సంభావనల లో స్థిర ప్రాతిపదిక న పట్టణ ప్రాంతాల అభివృద్ధి, విపత్తు ల వేళ ల్లో నిర్వహణ మరియు విపత్తు ల తాలూకు ప్రభావాన్ని ఉపశమింపచేయడం, జలవాయు పరివర్తన యొక్క ప్రభావాన్ని గమనించడం, అటవీప్రాంతాల నిర్వహణ, జల నిర్వహణ, ఎడారీకరణ ను నిరోధించడం లతో పాటు గా ఆహార సురక్ష వంటివి భాగం గా ఉన్నాయి. ఆ కోవ కు చెందిన ముఖ్యమైన రంగాల లో ఘటన క్రమాల ను గురించి చర్చించడానికి ఒక వేదికగా ఈ సమావేశం మారగలదన్న ఆకాంక్ష ను ఆయన వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో ఈ కార్యక్రమం పట్ల తన ఆశాభావాన్ని వెలిబుచ్చుతూ ‘‘వరల్డ్ జియో స్పేశల్ ఇండస్ట్రీ తో సంబంధం కలిగివున్న వర్గాలన్నీ ఒక చోటు కు చేరి, విధాన నిర్ణేత లు మరియు విద్య జగతి దిగ్గజాలు ఒకరి తో మరొకరు అరమరిక లు లేకుండా చర్చించుకోవడం చూస్తూ ఉంటే, ఈ సమావేశం గ్లోబల్ విలేజ్ ను ఒక సరికొత్త భవిష్యత్తు లోకి తీసుకుపోవడం లో సాయపడుతుంది అనే నమ్మకం నాకు కలుగుతోంది’’ అని పేర్కొన్నారు.

 

***********

DS/LP