Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుకె ప్రధాని గా శ్రీ రుషిసునక్ పదవీబాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ఆయన తో మాట్లాడిన ప్రధాన మంత్రి 


శ్రీ రుషి సునక్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. శ్రీ రుషి సునక్ యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) కు ప్రధాని గా పదవీబాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ఆయన కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఈ రోజు న శ్రీ @RishiSunak తో మాట్లాడిన తరువాత నాకు ఆనందం కలిగింది. యుకె కు ప్రధాని గా పదవీబాధ్యతల ను స్వీకరించినందుకు గాను ఆయన ను అభినందించాను. మన విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం కోసం మేం కలసి పనిచేస్తాం. ఒక సమగ్రమైనటువంటి మరియు సంతులితమైనటువంటి ఎఫ్ టిఎ ను త్వరిత గతి న పూర్తి చేయడానికి ఉన్న ప్రాముఖ్యం పట్ల సైతం మేం సమ్మతి ని వ్యక్తం చేశాం.’’ అని పేర్కొన్నారు.