Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుఎఇ లో జరిగిన భారతీయ సముదాయం సంబంధి కార్యక్రమం ‘‘అహ్‌లన్ మోదీ’’ లో ప్రధాన మంత్రి ప్రసంగం

యుఎఇ లో జరిగిన భారతీయ సముదాయం సంబంధి కార్యక్రమం  ‘‘అహ్‌లన్ మోదీ’’ లో ప్రధాన మంత్రి ప్రసంగం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవార్థం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని భారతీయ సముదాయం ఏర్పాటు చేసినటువంటి ‘‘అహ్‌లన్ మోదీ’’ కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొని, సభ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో 7 ఎమిరేట్స్ నుండి భారతీయ ప్రవాసుల తో పాటు అన్ని సముదాయాల కు చెందిన భారతీయులు పాల్గొన్నారు. సభ కు హాజరు అయిన వారిలో ఎమిరేట్స్ పౌరులు కూడా ఉన్నారు.

 

అబూ ధాబీ లో జాయద్ స్పోర్ట్స్ స్టేడియమ్ లోకి ప్రధాన మంత్రి ప్రవేశించడం తోనే 40,000 సంఖ్య లో ఉన్న శ్రోతలు ఆయన కు స్నేహపూర్ణ ఆహ్వానాన్ని పలికారు. ప్రధాన మంత్రి తన ప్రసంగం లో భారతదేశాని కి మరియు యుఎఇ కి మధ్య ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా బలపరచడం కోసం భారతీయ ప్రవాసులు అందిస్తున్నటువంటి తోడ్పాటు కు సంబంధించి న తన అభిప్రాయాల ను వెల్లడించారు. భారతీయ సముదాయం పట్ల చూపుతున్న అనుగ్రహం మరియు సంరక్షణ లకు గాను యుఎఇ పాలకుల కు మరియు యుఎఇ ప్రభుత్వాని కి ధన్యవాదాల ను ఆయన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యం గా, కఠినమైనటువంటి కోవిడ్ కాలం లో తీసుకొన్న ప్రత్యేక సంరక్షణ ను గురించి ఆయన ప్రస్తావించారు. ఆ కాలం లో భారతీయ ప్రవాసుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని సమకూర్చడమైంది. గడచిన పది సంవత్సరాల లో దేశం సాధించిన ప్రగతి కి సంబంధించిన తన దృష్టి కోణాన్ని కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు. భారతదేశం 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన దేశం) గా మారే దిశ లో 2030 వ సంవత్సరాని కల్లా మూడో అతి పెద్దదైనటువంటి ఆర్థిక వ్యవస్థ గా నిలుస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారతదేశం ఒక ‘‘విశ్వబంధు’’ గా నడుచుకొంటోందని, మరి ప్రపంచ పురోగతి కి మరియు ప్రపంచ శ్రేయాని కి తోడ్పాటు ను అందిస్తోందని కూడా ఆయన అన్నారు.

 

సుమారు 3.5 మిలియన్ మంది భారత దేశ స్థులు యుఎఇ లో ఉంటున్నారు. ప్రపంచం లో ఇంత పెద్ద సంఖ్య లో భారతదేశం పౌరులు మనుగడ సాగిస్తున్నది యుఎఇ లోనే. ఈ కార్యక్రమాన్ని నిజంగానే స్మరణీయమైంది గా మలచడం కోసం ‘‘అహ్‌లన్ మోదీ’’ సన్నాహాల ను అనేక నెలలు ముందే చేపట్టడమైంది.

 

***