ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘యుఎఇ’లో అధికార పర్యటనలో భాగంగా ఇవాళ అబుధాబి చేరుకున్నారు. యుఎఇ అధ్యక్షుడు గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విమానాశ్రయంలో ఆయనకు ప్రత్యేకంగా సాదర స్వాగతం పలుకగా, ఆ తర్వాత అధికార లాంఛనాలతో స్వాగతించారు.
ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ ముఖాముఖి సంభాషణలతోపాటు ప్రతినిధి స్థాయి చర్చల్లో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించడంతోపాటు కొత్త రంగాల్లో సహకారంపై చర్చించారు. వాణిజ్యం-పెట్టుబడులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికార్థిక, సాంస్కృతిక, ఇంధన, భౌతిక మౌలిక సదుపాయాలు, ప్రజల మధ్య సంబంధాలు సహా అనేక రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు. అలాగే, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించారు.
దేశాధినేతలిద్దరూ కింది అంశాలకు సంబంధించి ఆదానప్రదానాల్లో పాల్గొన్నారు:
డిజిటల్ ‘రూపే’ క్రెడిట్/డెబిట్ కార్డు దొంతర ప్రాతిపదికగా యుఎఇ దేశీయకార్డు జేవాన్‌ను ప్రారంభించడంపై అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అనంతరం జేవాన్ కార్డు ద్వారా నిర్వహించిన లావాదేవీని అధినేతలిద్దరూ తిలకించారు.
ఇంధన రంగంలో భాగస్వామ్య బలోపేతంపైనా వారిద్దరూ చర్చించారు. ముడిచమురు, వంటగ్యాస్ రంగాల్లో యుఎఇ అతిపెద్ద వనరులలో ఒకటి కాగా, దీంతోపాటు ప్రస్తుతం ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్‌జి) కోసం దీర్ఘకాలిక కాంట్రాక్టులపై వారు హర్షం వ్యక్తం చేశారు.
కాగా, ప్రధాని పర్యటనకు ముందు ‘రైట్స్’ లిమిటెడ్ సంస్థ, గుజరాత్ మారిటైమ్ బోర్డు అబుధాబి రేవుల కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఓడరేవుల మౌలిక సదుపాయాల నిర్మాణంతోపాటు రెండు దేశాల మధ్య అనుసంధానం మెరుగుకు ఈ ఒప్పందాలు తోడ్పడతాయి.
అబుధాబిలో ‘బిఎపిఎస్’ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడంలో ఔదార్యం ప్రదర్శించడంతోపాటు మద్దతు తెలిపినందుకుగాను గౌరవనీయ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. యుఎఇ-భారత్ మధ్య లోతైన స్నేహ, సాంస్కృతిక బంధానికి బిఎపిఎస్ ఆలయం గర్వకారణం మాత్రమేగాక సహనం, సామరస్యం, శాంతియుత సహజీవనంపై యుఎఇ అంతర్జాతీయ నిబద్ధతకు ప్రతీకగా ఉభయపక్షాలూ అభివర్ణించాయి.
Upon his arrival in Abu Dhabi, PM @narendramodi was warmly received by UAE President, HH @MohamedbinZayed at the airport. pic.twitter.com/U2ONrQU4Tn
— PMO India (@PMOIndia) February 13, 2024
Had an excellent meeting with my brother HH @MohamedBinZayed. India-UAE friendship is growing stronger and stronger, greatly benefitting the people of our nations. pic.twitter.com/QTdYgrMN3o
— Narendra Modi (@narendramodi) February 13, 2024
كان لقاءً ممتازاً مع أخي صاحب السمو الشيخ @MohamedBinZayed. إن الصداقة بين الهند والإمارات العربية المتحدة تنمو بشكل أقوى وأقوى، مما يفيد شعبينا بشكل كبير. pic.twitter.com/HSZlAZRmXX
— Narendra Modi (@narendramodi) February 13, 2024