ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ న మహారాష్ట్ర లోని యవత్‌మాల్ ను మరియు ధులే ను సందర్శించనున్నారు. రాష్ట్రం లో అనేక పథకాల ను ఆయన ప్రారంభించనున్నారు.
యవత్‌మాల్ లో
ప్రధాన మంత్రి ఒక మీట ను నొక్కి, నాందేడ్ లో ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల ను ప్రారంభిస్తారు. అత్యాధునిక సౌకర్యాల తో కూడిన ఈ పాఠశాల లో 420 మంది విద్యార్థులు ఉండి చదువుకోవచ్చును. దీని ద్వారా ఆదివాసీ విద్యార్థుల కు విద్య సంబంధ నాణ్యత ను మెరుగుపరచే వీలు ఉంది. అంతేకాక వారి సర్వతోముఖ వృద్ధి కి మరియు వారి స్వీయ వికాసానికి కూడా ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎమ్‌ఎవై) లో భాగం గా నిర్మాణం జరిగిన ఇళ్ళ లబ్దిదారుల లో ఎంపిక చేసిన కొందరు లబ్ధిదారుల కు ప్రధాన మంత్రి ఇ-గృహ ప్రవేశ్ పద్ధతి లో తాళం చెవుల ను అందజేయనున్నారు.
నాగ్‌పుర్ లోని అజ్నీ నుండి పుణే కు రాకపోకలు జరిపే ఒక రైలు కు ప్రధాన మంత్రి వీడియో లింక్ ద్వారా పచ్చ జెండా ను చూపుతారు. ఈ రైలు లో త్రీ టైర్ ఎయిర్ కండీషన్ డ్ కోచ్ లు ఉంటాయి. ఇది నాగ్ పుర్ మరియు పుణే ల మధ్య రాత్రి పూట సేవ ను అందజేయనుంది. కేంద్రీయ రహదారి నిధి (సిఆర్ఎఫ్)లో భాగం గా నిర్మాణం జరుగనున్న రోడ్ల కు పునాదిరాయి ని వేయడం కోసం ఉద్దేశించిన ఒక మీట ను ప్రధాన మంత్రి నొక్కుతారు.
మహిళా స్వయం సహాయ బృందాల కు మహారాష్ట్ర స్టేట్ రూరల్ లైవ్ లీహుడ్ స్ మిశన్ (ఎమ్ఎస్ఆర్ఎల్ఎమ్)లో భాగంగా సర్టిఫికెట్ల ను/చెక్కుల ను ప్రధాన మంత్రి ప్రదానం చేస్తారు. ఆర్థిక సేవల ను ఇంటి ముంగిట అందజేసే సదుపాయం తో కూడినటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర జీవనోపాధి మార్గాల కు సహాయాన్ని అందించడం, తద్వారా అన్ని వర్గాల కు ఆర్థిక సేవల ను అందజేసేందుకు ఉద్దేశించిందే ఎమ్ఎస్ఆర్ఎల్ఎమ్.
ధులే లో :
ప్రధాన మంత్రి ఆ తరువాత మహారాష్ట్ర లోని ధులే ను సందర్శిస్తారు. అక్కడ ఆయన పిఎంకెఎస్‌వై లో భాగం గా దిగువ పంజారా మీడియమ్ ప్రోజెక్టు ను ప్రారంభించనున్నారు. ఈ ప్రోజెక్టు ను 2016-17లో ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (పిఎంకెఎస్ వై)లో చేర్చడమైంది. దీని లో 109.31 ఎంసియుఎం ల నీటి ని నిల్వ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ధులే జిల్లా లో సుమారు 21 గ్రామాల కు ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా 7585 హెక్టార్ల భూమి కి సాగు నీటి ని అందించే సామర్ధ్యం ఈ ప్రోజెక్టు కు ఉంటుంది.
ప్రధాన మంత్రి సుల్‌వాడే జాంఫల్ కనోలీ ఎత్తిపోతల పథకాని కి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం వర్ష కాలం లో తాపీ నది నుండి 9.24 టిఎంసి ల వరద జలాల ను ఎత్తిపోసేందుకు ఉద్దేశించింది. ఇది ధులే జిల్లా లోని దాదాపు 100 గ్రామాల లో 33367 హెక్టార్ల భూమి కి సేద్యపు నీటి ని అందించేందుకు ఉద్దేశించింది.
ప్రధాన మంత్రి ఎఎమ్ఆర్‌యుటి (‘అమృత్’)లో భాగం గా ధులే నగర నీటి సరఫరా పథకాని కి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం పారిశ్రామిక వృద్ధి కి, వాణిజ్య వృద్ధి కి ఉత్తేజాన్ని ఇచ్చే విధం గా జల లభ్యత కై ఉద్దేశించింది.
ధులే-నర్ దానా రైలు మార్గాని కి, అలాగే జల్‌గావ్- మన్ మాడ్ మూడో రైలు మార్గాని కి శంకు స్థాపన చేయనున్నారు. భుసావల్- బాంద్రా ఖందేశ్ ఎక్స్‌ప్రెస్ రైలు కు ప్రధాన మంత్రి వీడియో లింకు ద్వారా పచ్చజెండా ను చూపుతారు. రాత్రి పూట సేవ అందించే ఈ రైలు ముంబయి, భుసావల్ ల నే నేరు గా కలుపుతుంది. ఈ రైలు వారం లో మూడు రోజుల పాటు రాకపోకలు జరుపుతుంది.
జల్‌గావ్ – ఉఢానా డబ్లింగ్ ను మరియు విద్యుదీకరించిన రైలు ప్రోజెక్టు ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ పథకం ప్రయాణికుల రవాణా సామర్థ్యాన్ని, అలాగే సరకు రవాణా సామర్ధ్యాన్ని పెంచనుంది. ఇది ఈ ప్రాంతం లోని నందుర్‌బార్, వ్యారా, ధరన్ గావ్ తదితర ప్రాంతాల అభివృద్ధి కి ఉత్ప్రేరకం గా పని చేయనుంది.
**