Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌నీలా లో 2017, న‌వంబ‌ర్ 14న జ‌రిగిన ఏశియాన్- ఇండియా స‌మిట్ లో ప్ర‌ధాన మంత్రి ఆరంభిక‌ ప్ర‌క‌ట‌న‌

మ‌నీలా లో 2017, న‌వంబ‌ర్ 14న జ‌రిగిన ఏశియాన్- ఇండియా స‌మిట్ లో ప్ర‌ధాన మంత్రి ఆరంభిక‌ ప్ర‌క‌ట‌న‌

మ‌నీలా లో 2017, న‌వంబ‌ర్ 14న జ‌రిగిన ఏశియాన్- ఇండియా స‌మిట్ లో ప్ర‌ధాన మంత్రి ఆరంభిక‌ ప్ర‌క‌ట‌న‌

మ‌నీలా లో 2017, న‌వంబ‌ర్ 14న జ‌రిగిన ఏశియాన్- ఇండియా స‌మిట్ లో ప్ర‌ధాన మంత్రి ఆరంభిక‌ ప్ర‌క‌ట‌న‌


శ్రేష్ఠులు, అధ్య‌క్షులు శ్రీ దుతెర్ తె,

ప్ర‌ముఖులారా,

ప్రెసిడెంట్ గారు,

ఆసియాన్ కు చెందిన ఈ ప్ర‌తిష్టాత్మ‌కమైన 50వ సంవ‌త్స‌రం సంద‌ర్భంగా మ‌నీలా కు నేను మొట్ట‌మొద‌టిసారిగా విచ్చేయ‌డం నాకు సంతోషాన్నిస్తోంది.

మ‌నం ఏశియాన్- ఇండియా డైలాగ్ పార్ట్‌న‌ర్ షిప్ 25 సంవ‌త్స‌రాలను కూడా జ‌రుపుకొంటున్నాం.

ముఖ్య‌మైన‌టువంటి ఈ సంవ‌త్స‌రంలో ఆసియాన్ కు స‌మ‌ర్ధ‌మైన రీతిలో సారథ్యం వ‌హిస్తున్నందుకు ఫిలిప్పీన్స్‌ ను నేను అభినందిస్తున్నాను. అలాగే, ఈ శిఖ‌ర స‌మావేశానికి శ్రేష్ఠ‌మైన ఏర్పాట్లు చేసినందుకు ప్రెసిడెంట్ గారూ, మీకు ఇవే నా ధ‌న్య‌వాదాలు.

అలాగే, ఏశియాన్- ఇండియా పార్ట్ న‌ర్‌ షిప్ ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి కంట్రీ కోఆర్డినేట‌ర్ గా తోడ్పాటు అందించిన వియ‌త్ నామ్ మాన్య ప్ర‌ధాని కి కూడా నేను ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.

ప్ర‌ముఖులారా,

ఆసియాన్ ఉత్స‌వం మాదిరి గానే ఆసియాన్ యొక్క ప్ర‌శంసాయోగ్య‌మైనటువంటి పయనం కూడా సింహావ‌లోక‌నం చేసుకోదగ్గదే.

ఈ చ‌రిత్రాత్మ‌క సంద‌ర్భంలో ఒక స్వ‌తంత్ర స‌ముదాయం గాను మ‌రియు ఒక దార్శ‌నిక‌త తోను, ఒక గుర్తింపు తోను క‌లిసి ప‌ని చేయ‌డానికి ఆసియాన్ మ‌రో మారు కంక‌ణ బ‌ద్ధురాలు కాగలద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను.

భార‌త‌దేశం అనుస‌రిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలిసీ’ ఆసియాన్ వ‌లెనే రూపు దిద్దుకొంది. అంతేకాకుండా, ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ భ‌ద్ర‌త స్వ‌రూపానికి ఇది కేంద్ర బిందువుగా నిలుస్తోంద‌న్న‌ది స్ప‌ష్టం.

3వ ఏశియాన్- ఇండియా ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో భాగంగా మ‌న స‌హ‌కారానికి సంబంధించిన విస్తృత శ్రేణి చ‌ర్చాంశాల పట్టిక సైతం చ‌క్క‌గా పురోగ‌మిస్తోంది. అది రాజకీయ భ‌ద్ర‌త‌, ఆర్థిక భాగ‌స్వామ్యం ల‌తో పాటు సాంస్కృతిక భాగ‌స్వామ్యం అనే మూడు కీల‌క స్తంభాల‌ను ఆధారంగా చేసుకొంది.

ప్ర‌ముఖులారా,

భార‌తదేశానికి, ఆసియాన్ దేశాల‌కు మ‌ధ్య వేల సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి కొన‌సాగుతున్న స‌ముద్ర సంబంధ మార్గాలు గ‌తించిన కాలంలో మ‌న వ్యాపార సంబంధాల‌కు ప్రాతిప‌దిక‌గా నిలచాయి. వాటిని మ‌రింత ప‌టిష్ట‌ప‌ర‌చుకొనేందుకు మ‌నం స‌న్నిహితంగా ఉంటూ కృషి చేయాలి.

నియ‌మాలపై ఆధారపడే ఒక ప్రాంతీయ భ‌ద్ర‌త స్వ‌రూపాన్ని ఆసియాన్ చెక్కు చెద‌ర‌కుండా నిల‌ప‌డంలో మరియు ఈ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు ఆసియాన్ పెద్ద పీటను వేస్తూ ఈ ప్రాంతం శాంతియుతంగా అభివృద్ధి చెందేందుకు గాను అవ‌స‌ర‌మైనటువంటి మ‌ద్ధ‌తును స్థిర ప్రాతిప‌దిక‌న ఆసియాన్ కు అందిస్తామ‌ంటూ భార‌త‌దేశం హామీనిస్తోంది.

ఉగ్ర‌వాదం తోను, హింసాత్మ‌క తీవ్ర‌వాదం తోను పోరాడ‌డానికి మ‌నం ఒక్కొక్క‌రం చాలా క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నాం. ఈ కీల‌క‌మైన రంగంలో స‌హ‌కారాన్ని ముమ్మ‌రం చేసుకోవ‌డం ద్వారా ఈ స‌వాలును మ‌న‌మంతా ఉమ్మ‌డిగా ప‌రిష్క‌రించుకోవ‌ల‌సిన త‌రుణం ఆస‌న్న‌మైంది.

ప్ర‌ముఖులారా,

మ‌న 25వ వార్షికోత్స‌వాలను జ‌రుపుకోవ‌డానికి ‘‘శేర్డ్ వాల్యూల్స్‌, కామ‌న్ డెస్టినీ’’ అనే సముచితమైనటువంటి ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకొని, అనేక సంస్మ‌ర‌ణాత్మ‌క కార్య‌క‌లాపాల‌తో ముందుకుపోతున్నాం.

ఈ స్మ‌ర‌ణీయ సంవ‌త్స‌రం త‌గిన విధంగా ముగింపునకు చేరుకోవడం కోసం మ‌రియు 2018 జ‌న‌వ‌రి 25న ఇండియా- ఏశియాన్ స్పెష‌ల్ క‌మెమరేటివ్ స‌మిట్ ను న్యూ ఢిల్లీ లో నిర్వ‌హించే సందర్భంలో మీకు స్వాగతం ప‌ల‌కడం కోసం నేను ఎదురుచూస్తాను.

భార‌త‌దేశ 69వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాలకు మా ముఖ్య అతిథులుగా ఆసియాన్ నాయ‌కుల‌ను ఆహ్వానించాల‌ని 1.25 బిలియ‌న్ భార‌తీయులు ఎంతో ఆస‌క్తిగా వేచి ఉన్నారు.

మ‌న ఉమ్మ‌డి భ‌వితవ్యాన్ని తీర్చిదిద్దుకోవ‌డం కోసం మీతో క‌లిసి ప‌ని చేసేందుకు నేను నిబ‌ద్ధుడినై ఉన్నాను.

మీకు ఇవే నా ధ‌న్య‌వాదాలు.

***