Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, ప్ర‌భుత్వ ప్రాధమ్యాల‌ లో ఒక‌టి అని స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన మంత్రి

మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, ప్ర‌భుత్వ ప్రాధమ్యాల‌ లో ఒక‌టి అని స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన మంత్రి

మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, ప్ర‌భుత్వ ప్రాధమ్యాల‌ లో ఒక‌టి అని స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన మంత్రి

మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, ప్ర‌భుత్వ ప్రాధమ్యాల‌ లో ఒక‌టి అని స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన మంత్రి


 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేర‌ళ లోని కొల్ల‌మ్ ను నేడు సంద‌ర్శించారు.  ఆయ‌న ఎన్‌హెచ్‌-66 లో భాగం గా ఉన్న 13 కి.మీ. పొడ‌వైన రెండు దోవ‌ల కొల్ల‌మ్ బైపాస్ ను దేశ ప్ర‌జ‌ల‌ కు అంకితం చేశారు.  ఈ కార్య‌క్ర‌మం లో కేర‌ళ గ‌వ‌ర్న‌ర్  శ్రీ జ‌స్టిస్ పి. సదాశివమ్, కేర‌ళ ముఖ్య‌మంత్రి శ్రీ పిన‌రాయీ విజ‌య‌న్, ప‌ర్య‌ట‌న శాఖ కేంద్ర మంత్రి శ్రీ కె.జె. అల్ఫోన్స్ లతో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

కొల్ల‌మ్ లోని ఆశ్ర‌మమ్ మైదానం లో జన సమూహాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ, మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కి త‌న ప్ర‌భుత్వ ప్రాధమ్యాల‌ లో ఒక‌ట‌ని, కొల్ల‌మ్ బైపాస్ దీనికి ఒక ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు.  

ఈ ప్రాజెక్టు 2015వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి లో తుది మంజూరు ను పొందిన‌ విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావిస్తూ ఇది ప్రస్తుతం వెలుగు లోకి వచ్చిందన్నారు.  సామాన్యుడి జీవన సౌల‌భ్యం కోసం ‘స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్’ పట్ల త‌న ప్ర‌భుత్వం విశ్వాసాన్ని ఉంచుతోంద‌ని, ఈ ప్రాజెక్టు పూర్తి కావటం లో కేర‌ళ ప్ర‌భుత్వం తోడ్పాటు ను మ‌రియు స‌హ‌కారాన్ని అందించిందంటూ ప్ర‌శంసించారు.

ఆలప్పుళ కు మ‌రియు తిరువ‌నంత‌పురాని కి మ‌ధ్య ప్ర‌యాణ కాలాన్ని, అలాగే కొల్లమ్ ప‌ట్ట‌ణం లో వాహ‌నాల రాక‌పోక‌ల ర‌ద్దీ ని కొల్ల‌మ్ బైపాస్ త‌గ్గించనుంది.  

కేర‌ళ లో ప్రాజెక్టుల ను గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, 2014వ సంవ‌త్స‌రం మే నెల నాటి నుండి కేర‌ళ లో దాదాపుగా 500 కి.మీ. ల జాతీయ ర‌హ‌దారి ని జోడించ‌డం జ‌రిగింద‌న్నారు.  భారత్ మాల లో భాగం గా ముంబ‌యి-క‌న్యకుమారి కారిడోర్ తాలూకు స‌మ‌గ్ర ప్రాజెక్టు నివేదిక కు రూపకల్పన జరుగుతోందని ఆయ‌న చెప్పారు.

ఈ ప్రాజెక్టుల‌న్నింటినీ స‌కాలం లో పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ ల‌క్ష్యం తో 12 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన 250 కు పైగా ప్రాజెక్టుల‌ ను పిఆర్ఎజిఎటిఐ ద్వారా స‌మీక్షించ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు.

ర‌హ‌దారి సంధానం అంశం లో పురోగ‌తి ని గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కిపలుకుతూ, ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వం తో పోల్చి చూస్తే జాతీయ ర‌హ‌దారుల, గ్రామీణ ర‌హ‌దారుల నిర్మాణ వేగం దాదాపు రెట్టింపు అయిన‌ట్లు చెప్పారు.  ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వ హ‌యాం లో కేవలం 56 శాతం జనావాసాలు సంధానించబడగా, ప్రస్తుతం 90 శాతానికి పైగా గ్రామీణ జ‌నావాసాలు సంధానించ‌బ‌డ్డాయ‌న్నారు.  త్వ‌ర‌లోనే గ్రామీణ ప్రాంతాల‌న్నింటికీ ర‌హ‌దారి సంధానాన్ని క‌ల్పించే ద‌శ‌ కు ప్ర‌భుత్వం చేరుకోగ‌లుగుతుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.  ప్రాంతీయ గ‌గ‌న‌త‌ల సంధానం మ‌రియు రైలు మార్గాల విస్త‌ర‌ణ లు చెప్పుకోద‌గ్గ స్థాయి లో మెరుగుప‌డ్డాయి; త‌ద్వారా ఉద్యోగ అవ‌కాశాల క‌ల్ప‌న జ‌రిగిందని ఆయ‌న చెప్పారు.  ‘‘మ‌నం ర‌హ‌దారుల‌ ను మ‌రియు సేతువుల‌ ను నిర్మిస్తున్నప్పుడు ఒక్క ప‌ట్ట‌ణాల‌ ను మ‌రియు గ్రామాల‌ ను మాత్ర‌మే జోడించ‌డం లేదు, ఆకాంక్ష‌ల‌ ను కార్య‌సాధ‌న‌ల తో, ఆశావాదాన్ని అవ‌కాశాల తో, అలాగే ఆశ‌ ను సంతోషం తో సంధానిస్తున్న‌ట్లే’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘ఆయుష్మాన్ భార‌త్’ను గురించి ఆయ‌న ప్ర‌స్తావిస్తూ, ఈ ప‌థ‌కం లో భాగంగా 8 ల‌క్ష‌ల మంది రోగులు ల‌బ్ది ని పొందార‌ని, ఈ ప‌థ‌కం లో ఇంత‌వ‌ర‌కు 1100 కోట్ల రూపాయ‌ల‌ కు పైగా ప్ర‌భుత్వం మంజూరు చేసింద‌న్నారు.  ‘ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం’ అమ‌లు ను వేగ‌వంతం చేయాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వాని కి ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.  ఇది జ‌రిగితే కేర‌ళ ప్ర‌జ‌లు ప్ర‌యోజ‌నాన్ని పొంద‌గ‌లుగుతార‌ని ఆయ‌న చెప్పారు.

కేర‌ళ యొక్క ఆర్థిక అభివృద్ధి లో ప‌ర్య‌ట‌న రంగం ముద్ర ఉందని, మ‌రి ఈ రంగం రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు ఒక ప్ర‌ధానమైన‌ పాత్ర ను పోషిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.  కేర‌ళ యొక్క ప‌ర్య‌ట‌న రంగ సామ‌ర్ధ్యాన్ని గుర్తిస్తూ రాష్ట్రం లోని 7 ప్రాజెక్టుల‌ కు ప్ర‌భుత్వం ‘స్వ‌దేశ్ ద‌ర్శ‌న్‌’, ఇంకా పిఆర్ఎఎస్ఎడి ప‌థ‌కాల లో భాగం గా 550 కోట్ల రూపాయ‌ల విలువైన నిధుల‌ ను మంజూరు చేసింద‌ని తెలిపారు.

ప‌ర్య‌ట‌న రంగ ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వివ‌రిస్తూ, ఈ రంగం లో విశేషమైన వృద్ధి ఉంద‌న్నారు.  భార‌త‌దేశం ప‌ర్య‌ట‌న రంగం లో 2016వ సంవ‌త్స‌రం లో 14 శాతానికి పైబ‌డిన‌ వృద్ధి ని న‌మోదు చేసింద‌ని, ఇదే రంగం లో ప్ర‌పంచం లో స‌గ‌టున 7 శాతం వృద్ధి ఉంద‌ని వెల్ల‌డించారు.  వ‌ర‌ల్డ్ ట్రావెల్ & టూరిజ‌మ్ కౌన్సిల్ యొక్క 2018వ సంవ‌త్స‌ర ప‌వ‌ర్ ర్యాంకింగ్ లో భార‌త‌దేశం ప్రస్తుతం 3వ స్థానం లో నిల‌చింద‌ని ఆయ‌న తెలిపారు.  భార‌త‌దేశాన్ని సంద‌ర్శించ‌డానికి త‌ర‌లివ‌చ్చిన విదేశీ యాత్రికుల సంఖ్య లో 42 శాతం పెరుగుద‌ల న‌మోదైంద‌ని, ఇది 2013వ సంవ‌త్స‌రం లో సుమారు 70 ల‌క్ష‌లు ఉండ‌గా 2017వ సంవ‌త్స‌రం లో దాదాపు ఒక కోటి కి చేరుకొంద‌న్నారు.  పర్యటన రంగం కారణం గా భార‌త‌దేశం ఆర్జించిన విదేశీ మార‌క ద్ర‌వ్యం లో 50 శాతం పెరుగుద‌ల చోటు చేసుకొంద‌ని, ఇది 2013వ సంవ‌త్స‌రం లో 18 బిలియ‌న్ డాల‌ర్లు గా ఉండ‌గా 2017వ సంవ‌త్స‌రం లో 27 బిలియ‌న్ డాల‌ర్ల‌ కు ఎగ‌బాకింద‌న్నారు.   ఇ-వీజా ను ప్రారంభించ‌డం భార‌త‌దేశ ప‌ర్య‌ట‌న రంగం లో ఒక మేలు మ‌లుపు గా మారినట్లు ఆయ‌న అభివ‌ర్ణించారు.  ఇది ప్రస్తుతం 166 దేశాల‌ కు చెందిన పౌరుల‌ కు ల‌భ్య‌మ‌వుతోంద‌ని తెలిపారు.