Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మౌలానా ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి


ఈ రోజు మౌలానా ఆజాద్ జయంతి.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.  జ్ఞానానికి ఒక  దీప స్తంభంలా మౌలానా ఆజాద్ నిలిచారు, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన మహత్తర భూమికను నిర్వహించారంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

సామాజిక,ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘ఈ రోజు మౌలానా ఆజాద్ జయంతి సందర్భంగా, ఆయనకు శ్రద్ధాంజలి సమర్పిద్దాం.  మన దేశ స్వాతంత్య్రోద్యమంలో ఆయన పోషించిన పాత్రకు, మరి అలాగే జ్ఞానానికి ఒక దీప స్తంభంలా నిలిచినందుకు గాను ఆయనను మనం ఆత్మీయంగా సదా స్మరించుకొంటూ ఉంటాం.  ఆయన గొప్ప ఆలోచనపరుడు మాత్రమే కాకుండా,  చేయి తిరిగిన రచయిత కూడా. అభివృద్ధి చెందిన భారత్ ను, సాధికారిత కలిగిన భారత్ ను ఆవిష్కరించాలన్న ఆయన దార్శనికత నుంచి మనం సదా ప్రేరణను పొందుతూనే ఉంటాం.’’