మోర్బీలో తాజా పరిస్థితిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి గాంధీనగర్ లోని రాజ్ భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మోర్బీలో దురదృష్టకర దుర్ఘటన సంభవించగానే ప్రారంభించిన రక్షణ-సహాయ కార్యక్రమాలపై ఈ సందర్భంగా అధికారులు ప్రధానికి అన్ని వివరాలూ నివేదించారు. ఈ విషాదానంతర అంశాలన్నిటిపైనా సమావేశం పూర్తిస్థాయిలో చర్చించింది. తర్వాత ప్రధాని స్పందిస్తూ- బాధితులకు వీలైనంత మేరకు సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతోపాటు రాష్ట్ర హోంశాఖ, విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు ఈ ఉన్నతస్థాయి సమీక్షలో పాల్గొన్నారు.
****