Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మోదీ హామీ’తో కష్టాల నుంచి గట్టెక్కిన సిమ్లాలోని రోహ్రూ వాసి కుశలాదేవి


   హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా నగర పరిధిలోగల రోహ్రు ప్రాంతంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో కుశలాదేవి 2022 నుంచి నీళ్లు మోయడంతోపాటు ఇతర పనులు కూడా చేస్తూ జీవిస్తున్నారు. ఇద్దరు పిల్లల ఈ ఒంటరి తల్లి పిఎం ఆవాస్ యోజన కింద పక్కా ఇంటికోసం రూ.1.85 లక్షల ఆర్థిక సహాయం పొందింది. ఆమెకు కొంత భూమి కూడా ఉండడంతో కుశలాదేవి బ్యాంకు ఖాతాలో రూ.2000 జమ అవుతూంటుంది.

   జీవితంలో ఎన్ని స‌మ‌స్య‌లు వచ్చినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆమె వాటిని అధిగమించిందంటూ ప్రధానమంత్రి ప్ర‌శంసించారు. శ్రీమతి కుశలాదేవి ఆయనతో మాట్లాడుతూ- తన పిల్లలు చదువుకుంటున్నారని, పక్కా ఇల్లు సమకూరిన తర్వాత కష్టాలు గట్టెక్కి, జీవితం గణనీయంగా మెరుగుపడిందని తెలిపింది. దీనిపై ప్రధాని స్పందిస్తూ- ఆమెతోపాటు పిల్లలకు చేయూతనిచ్చే ఇతర పథకాల ప్రయోజనాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ ఈ స్ఫూర్తిని కొనసాగించాలని ఆమెకు సూచించారు. ఇందుకోసం ‘మోదీ హామీ వాహనం’ నుంచి  అవసరమైన సమాచారాన్ని పొందాల్సిందిగా సలహా ఇచ్చారు. ‘‘గడచిన 9 సంవత్సరాలుగా అన్ని పథకాలూ మహిళా కేంద్రకంగానే ఉంటున్నాయి. మేము సత్కార్యాలు చేయడానికి మీలాంటి వారే శక్తి ప్రదాతలు’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.