Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మొద‌టి 10 యేళ్ళ‌లో వీలైనంత ఎక్కువ సేవ‌లు అందించండి

మొద‌టి 10 యేళ్ళ‌లో వీలైనంత ఎక్కువ సేవ‌లు అందించండి

మొద‌టి 10 యేళ్ళ‌లో వీలైనంత ఎక్కువ సేవ‌లు అందించండి

మొద‌టి 10 యేళ్ళ‌లో వీలైనంత ఎక్కువ సేవ‌లు అందించండి

మొద‌టి 10 యేళ్ళ‌లో వీలైనంత ఎక్కువ సేవ‌లు అందించండి

మొద‌టి 10 యేళ్ళ‌లో వీలైనంత ఎక్కువ సేవ‌లు అందించండి


2013 బ్యాచ్ కు చెందిన యువ ఐఏఎస్ అధికారుల‌తో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు స‌మావేశ‌మ‌య్యారు. ఈ అధికారులంద‌రూ కేంద్ర ప్ర‌భుత్వ స‌హాయ కార్య‌ద‌ర్శులుగా 3 నెల‌ల శిక్ష‌ణా కాలాన్ని పూర్తిచేసుకోవ‌డం విశేషం. కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద త‌మ వృత్తి జీవ‌నానికి శ్రీ‌కారం చుట్టిన మొట్ట‌మొద‌టి ఐఏఎస్ అధికారుల బ్యాచ్ కూడా ఇదే. ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగిస్తూ వారిని త‌మ స‌ర్వీసులోని తొలి ద‌శాబ్ద కాలాన్నిసాధ్య‌మైనంత ఉత్త‌మంగా ఉప‌యోగించుకోవాల‌న్నారు. బాగా క‌ష్టించి ప‌నిచేస్తూ ప్ర‌జ‌ల‌లో స‌మూల మార్పుల‌కు బాట‌లు వేయాల‌ని, ప్ర‌జ‌ల మేలు కోసం త‌మ వంతుగా పాటుప‌డేందుకు ల‌భించిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఐఏఎస్ అధికారులు త‌మ‌కు వ‌చ్చిన కొత్త‌కొత్త ఆలోచ‌న‌ల‌ను అమ‌లుచేయ‌డంలో పాత త‌రంవారి నుంచి త‌ర‌చుగా ప్ర‌తిఘ‌ట‌న ఎదురుకావ‌చ్చ‌ని, అయితే శ్ర‌మ‌కోర్చి ప‌నిచేస్తూ ప్ర‌జ‌ల‌ను త‌మ‌తోపాటు ముందుకు తీసుకువెళ్ళ‌గ‌ల‌గాల‌ని, ఇదే ఉత్త‌మ‌మైన మార్గ‌మ‌ని ప్ర‌ధాని సూచించారు. ప్ర‌జ‌ల‌ను స‌మ‌న్వ‌య‌ప‌రుస్తూ సాగిపోవ‌డ‌మే కీల‌క‌మ‌ని ఆయ‌న‌ చెప్పారు. ఈ సంద‌ర్భంగా అధికారులు ప్ర‌ధాని స‌మ‌క్షంలో 6 ప్ర‌ధాన ప‌థ‌కాలు…. ముద్ర‌, ప్ర‌భుత్వ స‌మాచారానికి మెరుగులు దిద్ద‌డం, వివిధ సేవ‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పౌరుల‌కు కీల‌క పాత్ర క‌ల్పించ‌డం, ఏక్ భార‌త్ – శ్రేష్ఠ భార‌త్‌, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్‌, జాతీయ ఖ‌నిజాన్వేష‌ణ విధానం…. వీటిపై త‌మ ఆలోచ‌న‌ల‌ను ఆవిష్క‌రించారు.