Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మొజాంబిక్ లో నేషనల్ అసెంబ్లీ ని సందర్శించిన ప్రధాన మంత్రి; మలువానాలో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్కు విద్యార్థులతో సంభాషించారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాపుతో లోని నేషనల్ అసెంబ్లీ ఆఫ్ మొజాంబిక్ ను సందర్శించారు. నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ వెరానికా మకామో తో ఆయన చర్చలు జరిపారు.

మలువాలోని సైన్స్ అండ్ టెక్నాలజీ పార్కు లో ఉన్న సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నలాజికల్ డెవలప్ మెంట్ ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.

ఈ సెంటర్ ఐటి సంబంధిత రంగాలలో తరగతి గది శిక్షణను ఇవ్వడంతో పాటు టెక్ స్టార్ట్ అప్స్ కు ఇంక్యుబేషన్ తదితర కీలక సేవలను అందిస్తుంటుంది.

సెంటర్ లోని విద్యార్థులతో ప్రధాన మంత్రి ముచ్చటించారు. అక్కడ పని చేస్తున్న వారి అనుభవాలను గురించి తనకు చెప్పాలంటూ వారిని ఆయన ఉత్సాహపరిచారు. భారతీయ విద్యా సంస్థలకు చెందిన పూర్వ విద్యార్థులతో నూ ఆయన సమావేశమయ్యారు.

మాపుతో లోని భారతీయ సముదాయ ప్రతినిధులతో కూడా ప్రధాన మంత్రి భేటీ అయ్యి, వారితో ముచ్చటించారు. భారతీయ సంతతికి చెందిన వారికి లభించిన గుర్తింపును వారికి తొలుదొల్త ఇచ్చింది ఆఫ్రికా భూభాగమే అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. తర తరాలుగా భారతీయ సంప్రదాయాలను పరిరక్షిస్తూ వస్తున్నందుకు భారతీయ సముదాయ ప్రతినిధులను ప్రధాన మంత్రి అభినందించారు.