ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. మొజాంబిక్, దక్షిణ ఆఫ్రికా, టాంజానియా, కెన్యా ల పర్యటనకు బయలుదేదేరి వెళ్లే ముందు చేసిన ప్రకటన పూర్తి పాఠం ఈ కింది విధంగా ఉంది.
“జూలై 7 గురువారం నాడు నేను మొజాంబిక్ లో ఉంటాను. సహకారాన్ని పెంచుకోవడం, సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటన ముఖ్యోద్దేశాలు. అధ్యక్షుడు శ్రీ ఫిలిప్ న్యూసీతో భేటీ అయ్యి, ఆయనతో విస్తృత చర్చలలో పాల్గొంటాను.
నేను పాల్గొనే ఇతర కార్యక్రమాలలో.. టాంజానియా జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు వెరానికా మకామో తో సమావేశం, మలువానా లోని ఎస్ అండ్ టి పార్కు సందర్శన వంటివి ఉన్నాయి. మలువానాలో విద్యార్థులతో నేను సంభాషించనున్నాను.
భారతీయ సముదాయం ప్రతినిధులతోనూ కాసేపు సమావేశమవుతాను.
7 జూలై సాయంత్రం నేను దక్షిణ ఆఫ్రికాలోని ప్రిటోరియా కు చేరుకుంటాను. మన దేశంతో చారిత్రకమైన, లోతుగా పాతుకుపోయిన సంబంధాలు ఉన్న దక్షిణ ఆఫ్రికా మనకు కీలక వ్యూహాత్మక భాగస్వామి. నా దక్షిణ ఆఫ్రికా పర్యటనలో నేను ప్రిటోరియా, జోహాన్నెస్‌బర్గ్, డర్ బన్, పీటర్‌మార్టిజ్‌బర్గ్ లలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటాను. దక్షిణ ఆఫ్రికాలో కొంతకాలం ఉండటం శ్రీ మహాత్మ గాంధీని, ప్రపంచ చరిత్రను ఎలా మార్చిందనే విషయానికి చరిత్రే సాక్ష్యం. ఓ న్యాయవాదిగా దక్షిణ ఆఫ్రికాలో ఉద్యోగం కోసం వెళ్లిన వ్యక్తి.. ఓ బలమైన మానవ విలువలున్న గొంతుకగా భారతదేశానికి తిరిగివచ్చారు. ఆ తర్వాత ఆయన విశ్వ మానవాళి చరిత్రను నిర్మించారు.
దక్షిణ ఆఫ్రికాలో ఉన్న రోజులలో మహాత్మ గాంధీ గారితో సన్నిహిత సంబంధమున్న ఫీనిక్స్ సెటిల్ మెంట్, పీటర్‌మార్టిజ్‌బర్గ్ స్టేషన్‌ను కూడా నేను సందర్శించనున్నాను. ప్రియమైన మదీబాను గుర్తు చేసుకోకుండా దక్షిణ ఆఫ్రికా పర్యటనకు సంపూర్ణత్వం రాదు. ఈ పర్యటనలో కాన్ స్టిట్యూషనల్ హిల్, నెల్సన్ మండేలా ఫౌండేషన్ లను సందర్శించే గొప్ప అవకాశం లభించనుంది. ఈ ఫౌండేషన్ వద్ద మానవ చరిత్రకు చిహ్నంగా నిలిచిన కీర్తిశేషుడు శ్రీ మండేలాకు నివాళులర్పిస్తాను. తన దేశాన్ని, ప్రపంచాన్ని ఉన్నతస్థానంలో నిలిపిన మహనీయుడు శ్రీ నెల్సన్ మండేలా.
ఈ పర్యటన సందర్భంగా దక్షిణ ఆఫ్రికా దేశాధ్యక్షుడు శ్రీ జాకబ్ జుమా తో సమావేశం కానున్నాను. ఉపాధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా తోనూ భేటీ అవుతాను.
మన ఆర్థిక బంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇండియా- సౌత్ ఆఫ్రికా బిజినెస్ మీట్ లో ప్రసంగించనున్నాను. నా ఇతర కార్యక్రమాలలో డర్ బన్‌లోని పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌తో సమావేశం, డర్ బన్ సిటీ హాల్‌లో నగర మేయర్ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కూడా ఉన్నాయి.
ఉత్సాహపూరితమైన భారత సమాజానికి దక్షిణ ఆఫ్రికా ఇల్లు లాంటిది. అందుకే చాలా మంది భారతీయులు ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నారు. జులై 8న జోహాన్నెస్‌బర్గ్ లో జరిగే కార్యక్రమంలో అక్కడి భారతీయ సమాజంతో సమావేశమవుతాను. ఇక్కడ నేను ప్రసంగించాల్సిన అంశాలపై.. ‘Narendra Modi Mobile App.’ ద్వారా మీ ఆలోచనలను పంచుకోండి.
జూలై 10 ఆదివారం టాంజానియా కు చేరుకుంటాను. ఈ పర్యటన చాలా చిన్నదే అయినా.. ఆఫ్రికాలో విలువైన మిత్రదేశంగా ఉన్న టాంజానియాతో బంధాలకు ఇది ప్రేరణ కలిగించే కీలకమైన పర్యటన. భారతదేశం-టాంజానియా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవటంతోపాటు వివిధ అంశాలపై టాంజానియా అధ్యక్షుడు డాక్టర్ జాన్ మాగూఫూలితో తో కూలంకష చర్చలు జరుపుతాను. ‘సోలార్ మమాస్’తోనూ సమావేశం కానున్నాను. సోలార్ మమాస్ అనేది ఆఫ్రికాలోని గ్రామీణ మహిళా సోలార్ ఇంజనీర్ల బృందం. వీరంతా భారతదేశ ప్రభుత్వపు మద్దతుతో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో సౌర శక్తితో పనిచేసే పరికరాలను తయారు చేయడం, వాటిని అమర్చడం, వాడడం, బాగుచేయడం, సౌర శక్తి లాంతరులను, వారి గ్రామాలలో గృహ సంబంధ సౌర శక్తి వ్యవస్థలను నిర్వహించడంలో శిక్షణ పొందారు.
అక్కడి భారతీయ సముదాయం తోనూ నేను భేటీ కానున్నాను.
జూలై 10 సాయంత్రం నా కెన్యా పర్యటన ఆరంభమవుతుంది. భారతదేశం-కెన్యా సంబంధాలు చిరస్థాయిగా నిలచి ఉన్నాయి. ఇరుదేశాల ప్రజల మధ్య బలమైన సత్సంబంధాలు ఉన్నాయి. గత శతాబ్దంలో ఇరు దేశాలు వలసవాదులతో పోరాటం చేసి, విజయం సాధించాయి.
కెన్యా అధ్యక్షుడు శ్రీ ఉహురు కెన్యాట్టాతో ద్వైపాక్షిక సహకారం, ఇరు దేశాల సంబంధా బలోపేతంపై చర్చిస్తాను. భారతదేశం, కెన్యాల మధ్య మంచి వాణిజ్య, వ్యాపార, సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని భావిస్తున్నాను. అపారమైన సామర్థ్యం ఉన్నందున ఇరు దేశాలు కలసి దీనిని వినియోగించుకోవాలి.
నైరోబీలో మహాత్ముడికి పుష్పాంజలి ఘటిస్తాను. కెన్యాలో శ్రీ మహాత్మ గాంధీ అంటే అపారమైన గౌరవం ఉంది. ఆఫ్రికా మహోన్నత రాజకీయ ప్రముఖులలో ఒకరైన కెన్యా తొలి అధ్యక్షుడు కీర్తిశేషుడు శ్రీ ఎంజీ జోమో కెన్యాట్టాకు నివాళులర్పిస్తాను.
భారతదేశం, కెన్యా ల వ్యాపారవేత్తలతో సమావేశం.. కెన్యాతో మన ఆర్థిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు కీలక వేదిక కాగలదు.
నైరోబీ విశ్వవిద్యాలయ విద్యార్థులతో సంభాషణ కార్యక్రమంలో పొల్గొనేందుకు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.
అక్కడి భారత సంతతి వారితో బంధాలను బలోపేతం చేసుకునేందుకు జూలై 10న ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తాను. భారత్‌వాలా ఆలమ్నీ అసోసియేషన్ తోనూ సమావేశం అవుతాను. అంబులెన్సులతో పాటు భాభత్రాన్ (ముంబయ్ లోని భాభా అటామిక్ రీసెర్చె సెంటర్.. కేన్సర్ చికిత్సకోసం రూపొందించిన పరికరం) ను అందజేసే మరొక కార్యక్రమం కూడా ఉంది.”
My Africa tour, aimed at enhancing ties between India & Africa will begin from Mozambique in a brief but key visit. https://t.co/LaOw7lk2fp
— Narendra Modi (@narendramodi) July 6, 2016
My programmes in South Africa will span across Pretoria, Johannesburg, Durban & Pietermaritzburg. Here are details. https://t.co/BTF9fpGRy6
— Narendra Modi (@narendramodi) July 6, 2016
In Tanzania I will hold talks with President Dr. John Magufuli, meet ‘Solar Mamas’ & interact with Indian community. https://t.co/gUqFNIr0Wz
— Narendra Modi (@narendramodi) July 6, 2016
Talks with President @UKenyatta, deliberations on economic & people-to-people ties will be focus of my Kenya visit. https://t.co/PGtDaEWKUU
— Narendra Modi (@narendramodi) July 6, 2016
Inviting you to share ideas via the Mobile App for my speeches at the community programmes in Johannesburg & Nairobi https://t.co/TYuxNO0R6P
— Narendra Modi (@narendramodi) 6 July 2016