Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘‘మేం ఈ రోజు న మరియు ఎల్లప్పటికీ మీ వెన్నంటి నిలబడతాం’’ అని టీమ్ ఇండియా కు చెప్పిన ప్రధాన మంత్రి


ప్రపంచ కప్ క్రికెట్ ఆటల పోటీ లో భారతీయ క్రికెట్ జట్టు ను ఆ జట్టు సభ్యులు ఇచ్చిన ప్రదర్శన కు గాను ప్రధాన మంత్రి వారి ని ప్రశంసించారు.

 

ఆటల పోటీ లో ఫైనల్ వరకు ఓటమి అనేది ఎరుగక ఆడుతూ వచ్చిన జట్టు ప్రపంచ కప్ తుది పోరు లో అపజయం పాలయినటువంటి సందర్భం లో, ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :

‘‘ప్రియమైన టీమ్ ఇండియా,

ప్రపంచ కప్ అంతటా మీరు కనబరచినటువంటి ప్రతిభ మరియు మీ యొక్క దృఢసంకల్పం లు గుర్తుంచుకోదగ్గవి గా ఉన్నాయి. మీరు గొప్ప ఉత్సాహం తో ఆడడం తో పాటు దేశ ప్రజలకు అమితమైనటువంటి గర్వకారకులు గా నిలచారు.

మేం ఈ రోజున ఇంకా ఎల్లప్పటికీ మీకు వెన్నంటి నిలబడతాం.’’ అని పేర్కొన్నారు.

 

***

Dhiraj Singh / Anil