సరకుల ను మూల స్థానం నుండి రవాణా చేయడం లో రికార్డు ఆదాయాన్ని సంపాదించినందుకు గాను దక్షిణ మధ్య రైల్ వే ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసల ను వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్ వే ఆరంభం అయినప్పటి నుండి చూస్తే ఈ విధమైన ఆదాయార్జన ఇదే అత్యధికం అని చెప్పాలి.
దక్షిణ మధ్య రైల్ వే చేసిన ట్వీట్ కు ప్రత్యుతతరం గా ప్రధాన మంత్రి తాను కూడా ఒక ట్వీట్ లో –
‘‘మంచి సరళి. ఆర్థిక వృద్ధి కి కూడా శుభ పరిణామం.’’ అని పేర్కొన్నారు.
Good trend! Augurs well for economic growth as well. https://t.co/swZnpDeSnC
— Narendra Modi (@narendramodi) February 15, 2023