Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మూడో వీర బాల దినోత్సవం సందర్భంగా 17 మంది రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ప్రధాని సంభాషణ

మూడో వీర బాల దినోత్సవం సందర్భంగా   17 మంది రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ప్రధాని సంభాషణ


పురస్కార గ్రహీత– నేను మూడు పుస్తకాలు రాశానునాకు చదవడమంటే ఇష్టం.. అందుకే నేను పుస్తకాలు రాయడం మొదలుపెట్టానునాకో అరుదైన వ్యాధి ఉంది.. నేనింకో రెండేళ్లే జీవిస్తానని చెప్పారుకానీ మా అమ్మమా అక్కమా బడి… నేను పుస్తకాలు ప్రచురించే సంస్థల సహకారంతోనే నేనిప్పుడిలా ఉన్నాను.

ప్రధానమంత్రి – నీలో స్ఫూర్తి నింపిందెవరు?

పురస్కార గ్రహీత – మా ఇంగ్లిష్ టీచరే అనుకుంటున్నా.

ప్రధానమంత్రి – ఇప్పుడు నువ్వు ఇతరులకూ స్ఫూర్తినిస్తున్నావునీ పుస్తకం చదివి స్పందిస్తూ నీకెవరైనా ఉత్తరాలు రాశారా?

పురస్కార గ్రహీత – రాశారు.

ప్రధానమంత్రి – మీకు ఏ రకమైన సందేశాలు అందాయి?

పురస్కార గ్రహీత – వారు సొంతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టామని చెప్పడం నాకు వచ్చిన సందేశాల్లో అతిపెద్దది.

ప్రధానమంత్రి – నువ్వెక్కడ శిక్షణ తీసుకున్నావుఅదెలా జరిగింది?

పురస్కార గ్రహీత – నేనెక్కడా శిక్షణ తీసుకోలేదు.

ప్రధానమంత్రి – శిక్షణ తీసుకోలేదానువ్విది చేయాలనుకున్నావ్.. అంతే!

పురస్కార గ్రహీత – అవును సర్.

ప్రధానమంత్రి – నువ్వింకా ఏ పోటీల్లో పాల్గొంటావు?

పురస్కార గ్రహీత – ఇంగ్లిష్ఉర్దూకశ్మీరీ పోటీల్లో పాల్గొంటాను.

ప్రధానమంత్రి – నీకు యూట్యూబ్ చానలుందాలేదా ఇంకెక్కడైనా ప్రదర్శనలిస్తావా?

పురస్కార గ్రహీత – అవును సర్నేను యూట్యూబ్ లో ఉన్నానుప్రదర్శనలు కూడా ఇస్తాను.

ప్రధానమంత్రి – మీ కుటుంబంలో ఇంకెవరైనా గాయకులున్నారా?

పురస్కార గ్రహీత – లేదు సర్.. ఎవరూ లేరు.

ప్రధానమంత్రి – నువ్వే మొదలుపెట్టావా?

పురస్కార గ్రహీత – అవును సర్.

ప్రధానమంత్రి – నువ్వేం చేశావునువ్వు చదరంగం ఆడతావా?

పురస్కార గ్రహీత – అవును.

ప్రధానమంత్రి – నీకు చదరంగం ఎవరు నేర్పారు?

పురస్కార గ్రహీత – మా నాన్నయూట్యూబ్.

ప్రధానమంత్రి – అవునా..

పురస్కార గ్రహీత – మా టీచర్ కూడా.

ప్రధానమంత్రి – ఢిల్లీలో చాలా చలిగా ఉంది.. చాలా చల్లగా ఉంది.

పురస్కార గ్రహీత – ఈ ఏడాది కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని కార్గిల్ యుద్ధ స్మారకం నుంచి జాతీయ యుద్ధ స్మారకం వరకు 1,251 కిలోమీటర్లు సైకిల్ తొక్కానురెండేళ్ల క్రితం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతులను పురస్కరించుకుని మొయిరాంగ్ లోని ఐఎన్ఏ స్మారకం నుంచి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వరకు సైకిల్ పై ప్రయాణించాను.

ప్రధానమంత్రి – ఒక్కో ప్రయాణానికీ నీకెన్ని రోజులు పడుతుంది?

పురస్కార గ్రహీత – మొదటి ప్రయాణంలో 32 రోజులు సైకిల్ తొక్కి 2,612 కిలోమీటర్లు ప్రయాణించానుఇప్పటి ప్రయాణానికి 13 రోజులు పట్టింది.

ప్రధానమంత్రి – ఒక రోజులో ఎంత దూరం ప్రయాణం చేస్తావు?

పురస్కార గ్రహీత – రెండు ట్రిప్పుల్లోనేను ఒక రోజులో గరిష్టంగా 129.5 కిలోమీటర్లు సైకిల్ తొక్కాను.

పురస్కార గ్రహీత – నమస్తే సర్.

ప్రధానమంత్రి – నమస్తే.

పురస్కార గ్రహీత – నేను రెండు ఇంటర్నేషనల్ బుక్ రికార్డులు సాధించానుమొదటిది ఒక నిమిషంలో 31 అర్ధ శాస్త్రీయ శ్లోకాల పఠనానికిగానూరెండోది ఒక నిమిషంలో 13 సంస్కృత శ్లోకాలను పఠించినందుకు.

ప్రధానమంత్రి – ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు?

పురస్కార గ్రహీత – సర్నేను యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాను.

ప్రధానమంత్రి – అవునా.. ఒక్క నిమిషం నువ్వేం చేశావో నాకు చూపించు.

పురస్కార గ్రహీత – ఓం భూర్భువ స్వఃతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధియో యో నః ప్రచోదయాత్. (సంస్కృతంలో)

పురస్కార గ్రహీత – నమస్తే సర్.

ప్రధానమంత్రి – నమస్తే.

పురస్కార గ్రహీత – నేను జాతీయ స్థాయిలో జూడోలో బంగారు పతకం సాధించాను.

ప్రధానమంత్రి – నిన్ను చూసి అందరూ భయపడాలేనువ్వు దీన్నెక్కడ నేర్చుకున్నావు — బడిలోనా?

పురస్కార గ్రహీత – లేదు సర్ఓ యాక్టివిటీ కోచ్ దగ్గర నేర్చుకున్నాను.

ప్రధానమంత్రి – అది గొప్ప విషయంనీ తర్వాతి లక్ష్యం ఏమిటి?

పురస్కార గ్రహీత – ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి దేశానికి పేరు తేవాలనుకుంటున్నాను.

ప్రధానమంత్రి – వావ్అంటే నువ్వు చాలా కష్టపడుతున్నావన్నమాట.

పురస్కార గ్రహీత – అవును సర్.

ప్రధానమంత్రి – నీకు చాలా హాకర్ క్లబ్బులున్నాయి.

పురస్కార గ్రహీత – అవునుప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో చట్టాల అమలును పటిష్ఠం చేసేందుకు శిక్షణ ఇస్తున్నాం. వేల మంది పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పాం. మన ప్రయోజనాలను కొనసాగిస్తూనే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించడం మా లక్ష్యం.

ప్రధానమంత్రి – మీ ప్రార్ధన ప్రాజెక్టు ఎలా ముందుకు సాగుతోంది?

పురస్కార గ్రహీత – ‘ప్రార్ధన’ ప్రాజెక్టు ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. డచ్మరికొన్ని సంక్లిష్ట భాషల్లోకి వేదాలను అనువదించే దిశగా మేం పరిశోధన చేస్తున్నాం.

పురస్కార గ్రహీత – అంతేకాదు.. పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల కోసం స్వీయ నియంత్రిత చెంచాను నేను రూపొందించానుమెదడు వయస్సును అంచనా వేసే నమూనానూ మేం రూపొందించాం.

ప్రధానమంత్రి – దీని కోసం మీరెన్ని సంవత్సరాలు పనిచేశారు?

పురస్కార గ్రహీత – సర్నేను రెండు సంవత్సరాలు దీని కోసం పనిచేశాను.

ప్రధానమంత్రి – తర్వాత ఏం చేస్తారు?

పురస్కార గ్రహీత – సర్నేను నా పరిశోధనను కొనసాగించాలనుకుంటున్నాను.

ప్రధానమంత్రి – మీరు ఎక్కడ నుండి వచ్చారు?

పురస్కార గ్రహీత – సర్నేను బెంగళూరు నుంచి వచ్చానునాకు హిందీ పెద్దగా రాదు.

ప్రధానమంత్రి – చాలా బాగా మాట్లాడుతున్నావునా కన్నా కూడా బాగా మాట్లాడుతున్నావు.

పురస్కార గ్రహీత – ధన్యవాదాలు సర్.

పురస్కార గ్రహీత – నేను కర్ణాటక సంగీతంసంస్కృత శ్లోకాల మేళవింపుతో హరికథా ప్రదర్శనలిస్తాను.

ప్రధానమంత్రి – మీరు ఎన్ని హరికథా ప్రదర్శనలిచ్చారు?

పురస్కార గ్రహీత – దాదాపు వంద ప్రదర్శనలు ఇచ్చాను.

ప్రధానమంత్రి – శభాష్.

పురస్కార గ్రహీత – గత రెండేళ్లలో ఐదు వేర్వేరు దేశాల్లోని ఐదు ఎత్తైన శిఖరాలను అధిరోహించిప్రతిదానిపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశానువేరే దేశానికి వెళ్లినప్పుడు.. నేను భారత్ నుంచి వచ్చానని చెప్తే ప్రజలు నన్నెంతో ప్రేమగాగౌరవంగా చూసుకునేవారు.

ప్రధానమంత్రి – నిన్ను కలిసినువ్వు భారత్ నుంచి వచ్చావని తెలిసినప్పుడు ప్రజలు ఏమనేవారు?

పురస్కార గ్రహీత – వాళ్లు నాపై చాలా ప్రేమగౌరవాలను చూపేవారునా ప్రతీ పర్వతారోహణ వెనుకా ఉన్న ఉద్దేశం బాలికా సాధికారతనుశారీరక దారుఢ్య ప్రాధాన్యాన్ని చాటడం.

పురస్కార గ్రహీత – నేను ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చేస్తానుఈ ఏడాది న్యూజిలాండ్ లో జరిగిన రోలర్ స్కేటింగ్ లో ఒక అంతర్జాతీయ బంగారు పతకాన్నీజాతీయ పతకాలనూ సాధించాను.

పురస్కార గ్రహీత – సర్నేను కూడా పారా అథ్లెట్ నేఈ నెల నుంచి వరకు థాయ్ లాండ్ లో జరిగిన పారా స్పోర్ట్ యూత్ కాంపిటీషన్ లో పాల్గొని.. బంగారు పతకం గెలవడం ద్వారా మన దేశానికి మంచి పేరు తెచ్చాను.

ప్రధానమంత్రి – వావ్.

పురస్కార గ్రహీత – ఈ ఏడాది యూత్ చాంపియన్ షిప్ లో కూడా బంగారు పతకం సాధించాను. 57 కేజీల కేటగిరీలో బంగారు పతకం గెలుచుకోవడంతోపాటు 76 కేజీల విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాను. అందులోనూ బంగారు పతకం గెలిచానుమొత్తం పోటీలోనూ బంగారు పతకాన్ని గెలిచాను.

ప్రధానమంత్రి – నువ్వు అన్ని పతకాలూ సొంతం చేసేసుకుంటున్నావ్!

పురస్కార గ్రహీత – లేదు సర్.

పురస్కార గ్రహీత – ఓసారి ఓ ఫ్లాట్ కు నిప్పంటుకుందిమొదట్లో ఎవరూ చూడలేదుఇంటి నుంచి పొగలు రావడాన్ని నేను గమనించానుకానీ ఎవ్వరూ లోపలికి ప్రవేశించే ధైర్యం చేయలేకపోయారు. తమాషాలు చేయొద్దనీలోపలికి పోతే ప్రమాదంలో ఇరుక్కుంటాననీ అంటూ వారంతా నన్ను ఆపాలని చూశారుకానీ నేను ధైర్యం చేసి లోపలికి వెళ్లి మంటలను ఆర్పేశాను.

ప్రధానమంత్రి – ఎన్ని ప్రాణాలు కాపాడావు?

పురస్కార గ్రహీత – భవనంలో 70 ఇళ్లు, 200 కుటుంబాలు ఉన్నాయి.

ప్రధానమంత్రి – నీకు ఈత వచ్చా?

పురస్కార గ్రహీత – అవును.

ప్రధానమంత్రి – అందరినీ కాపాడారా?

పురస్కార గ్రహీత – అవును.

ప్రధానమంత్రి – నీకు భయం వేయలేదా?

పురస్కార గ్రహీత – లేదు.

ప్రధానమంత్రి – అంతా అయిపోయిన తర్వాతమీరో గొప్ప పనిచేశారని తెలిసి మీకు మంచి అనుభూతి కలిగిందా?

పురస్కార గ్రహీత – అవును.

ప్రధానమంత్రి – శభాష్

 

 

***