Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మూడవ భారత్ – ఆఫ్రికా ఫోరం సదస్సు ముగింపు వేడుకలో ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం

మూడవ భారత్ – ఆఫ్రికా ఫోరం సదస్సు ముగింపు వేడుకలో ప్రధాన మంత్రి  ప్రసంగం పూర్తి పాఠం

మూడవ భారత్ – ఆఫ్రికా ఫోరం సదస్సు ముగింపు వేడుకలో ప్రధాన మంత్రి  ప్రసంగం పూర్తి పాఠం

మూడవ భారత్ – ఆఫ్రికా ఫోరం సదస్సు ముగింపు వేడుకలో ప్రధాన మంత్రి  ప్రసంగం పూర్తి పాఠం

మూడవ భారత్ – ఆఫ్రికా ఫోరం సదస్సు ముగింపు వేడుకలో ప్రధాన మంత్రి  ప్రసంగం పూర్తి పాఠం

మూడవ భారత్ – ఆఫ్రికా ఫోరం సదస్సు ముగింపు వేడుకలో ప్రధాన మంత్రి  ప్రసంగం పూర్తి పాఠం

మూడవ భారత్ – ఆఫ్రికా ఫోరం సదస్సు ముగింపు వేడుకలో ప్రధాన మంత్రి  ప్రసంగం పూర్తి పాఠం


మహోదయులారా

ఈ సదస్సుకు సహాధ్యక్షుడు ప్రెసిడెంట్ శ్రీ ముగాబే

ఇది వాస్తవంగా ఒక చారిత్రక దినం.

యావత్ ఆఫ్రికా భావాలను వినే అవకాశం మాకు వచ్చింది.

బంజూల్ ఫార్ములాకు అనుగుణంగా గతంలో జరిగిన రెండు శిఖరాగ్రాలు కొన్ని దేశాలకే పరిమితం అయ్యాయి.

ఈ శిఖరాగ్రంలో మొత్తం 54 ఆఫ్రికా దేశాలు భాగస్వాములు కావడం మాకు లభించిన ప్రత్యేక గౌరవం.

భారత, ఆఫ్రికా సదస్సుకు ఇదే చక్కని విధానమని ఈ శిఖరాగ్రంలో భాగస్వాములు కావడం ద్వారా మీరు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

మీ ఆలోచనలు పంచుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

మిత్రుల అనుభవపాఠాలు అందించిన జ్ఞానానికి సాటి అయినది మరొకటుండదు.

మీ అందరూ మీ దేశాల కోసం, ఆఫ్రికా ఖండం కోసం వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ప్రపంచం పట్ల ప్రకటించిన దృక్పథం, భారత్ పట్ల వ్యక్తం చేసిన అభిప్రాయాలు, మన భాగస్వామ్యంపై ప్రకటించిన అంచనాలు భారత్లోని మా అందరికీ స్ఫూర్తిదాయకం.
మీ అందరి స్నేహభావం, విశ్వాసం మాకు గర్వకారణమే కాదు…ఒక బలం.

మీ అందరి అభిప్రాయాలు విన్న తర్వాత భారత, ఆఫ్రికా బంధం సహజసిద్ధమైనదన్న నా అభిప్రాయం మరింతగా బలపడింది. మన ఆశలు, సవాళ్ళు, భవిష్యత్తుపై గల ఆకాంక్షలు అన్నీ పరస్పర అనుసంధానమై ఉన్నాయి.

సమ్మిళిత వృద్ధి, పౌరుల సాధికారత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా సాంస్కృతికంగాను, ఇతరత్రా మరింత పటిష్ఠమైన, శాంతి, భద్రత, సుసంపన్నతలతో కూడిన ఆఫ్రికా కోసం మీరు కంటున్న కలలు సాకారం చేసేందుకు మేం మీతో కలిసి పని చేస్తాం. ప్రస్తుత ప్రపంచంలో దీని ప్రాముఖ్యత చాలా ఉంది. మరింత బలీయమైన భాగస్వామ్యాలకు అది కారణమవుతుంది.

మన భాగస్వామ్యాలను మరింత శక్తివంతం ఎలా చేసుకోవాలన్న విషయంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నేను సావధానంగా విన్నాను.

మీరు అందించిన సలహాలు, అనుభవ పాఠాలు మేం మీకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పునర్నిర్మించే విషయంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. మీరు వ్యక్తం చేసిన ప్రత్యేక కారణాలు మేం గమనంలోకి తీసుకుని మరింత వేగంగాను, పారదర్శకంగాను పని చేసేందుకు మేం ప్రయత్నిస్తాం. మాకు ఎప్పుడూ మీ ప్రాధాన్యతలే మార్గదర్శకం.

ఆఫ్రికాలో వ్యవస్థల ఏర్పాటుపై మేం నేర్చుకున్న పాఠాలు ప్రాజెక్టులు మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో మాకెంతో సహాయకారిగా నిలుస్తాయి.

మా స్కాలర్షిప్ కార్యక్రమానికి వచ్చిన అద్భుత స్పందన మాకెంతో ప్రోత్సాహకరం. దాన్ని మరింత మెరుగుపరచడం ద్వారా భారత్లోనే బస చేసి చదువుకోవడం లేదా శిక్షణ పొందడం కోసం మరింత సానుకూలమైన వాతావరణం మేం నెలకొల్పుతాం.
టెక్నాలజీ భాగస్వామ్యాలకు మీరు ఇస్తున్న ప్రాధాన్యత కూడా నేను అర్ధం చేసుకున్నాను. భారత్లో మాదిరిగానే ఆఫ్రికా దేశాల్లోని మారుమూల ప్రాంతాల్లోని బలహీనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వారధిగా వాడేందుకు మేం ప్రయత్నిస్తాం.
భారత, ఆఫ్రికా దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు మేం అధిక ప్రాధాన్యం ఇస్తాం. మా వాణిజ్యంలో మరింత సమతూకం తెచ్చే ప్రయత్నం చేస్తాం. భారత మార్కెట్ను ఆఫ్రికాకు అందుబాటులోకి తెస్తాం. 34 దేశాలకు అందిస్తున్న సుంకాలకు తావు లేని మార్కెట్ అవకాశాన్ని మరింత సమర్థవంతంగాను, పూర్తి స్థాయిలో అమలుపరిచేందుకు మేం కృషి చేస్తాం.

పలు ఆఫ్రికా దేశాలతో మాకు అత్యద్భుతమైన రక్షణ, భద్రతా సహకారం ఉంది. ద్వైపాక్షిక, బహుముఖీన, ప్రాంతీయ యంత్రాంగాల ద్వారా ఈ సహకారం అందుకుంటున్నాం. ప్రధానంగా సామర్థ్యాల అభివృద్ధి ఆధారిత సన్నిహిత రక్షణ, భద్రతా సహకారం భారత-ఆఫ్రికా భాగస్వామ్యానికి మూల స్తంభంగా నిలుస్తుంది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని కూడా మేం మరింత విస్తరించుకుంటాం. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రపంచం యావత్తును సంఘటితం చేసేందుకు కృషి చేస్తాం.

మహోదయులారా

ఆలోచనలు-ఆచరణ, లక్ష్యాలు-అమలు మధ్య ఉండే వ్యత్యాసం గురించి మాకు బాగా తెలుసు.

ప్రాజెక్టులు ఆవిష్కరించడం ఎంత ప్రధానమో అమలు పరచడం కూడా అంతే ప్రధానం. మేం పర్యవేక్షణ వ్యవస్థలను పటిష్ఠం చేస్తాం. ఆఫ్రికా యూనియన్తో కలిసి ఉమ్మడి పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు కూడా ఇందులో ఒకటి

మహోదయులారా

మరింత సమ్మిళితమైన, న్యాయబద్ధమైన, ప్రజాస్వామిక ప్రపంచ వ్యవస్థ ఏర్పాటు కావడంలో మనందరి మధ్య ఉన్న సంఘీభావం, ఐక్యత ప్రధాన శక్తిగా నిలుస్తుంది. అందుకు అవసరమైన బాట వేయాల్సిన కీలక ఘట్టంలో మనందరం ఉన్నాం.

ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల గురించి మన మధ్య సహకారం, భాగస్వామ్యాలను మరింతగా పెంచేందుకు కృషి చేయాలి. అభివృద్ధి అజెండా-2030కి అనుగుణంగా అంతర్జాతీయ భాగస్వామ్యాలను నిర్మించుకునేందుకు, అంతర్జాతీయ వాణిజ్యంపై ఉమ్మడి లక్ష్యాల సాధనకు కలసి పనిచేయాలి. వాతావరణ మార్పులపై జరిగే పారిస్ సమావేశం ద్వారా మన ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు పాటుపడుదాం.

మనందరి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా రూపాంతరం చెందిన ప్రపంచ వ్యవస్థ మనందరం మరిన్ని మెరుగైన విజయాలు నమోదు చేయడానికి దోహదపడుతుంది.

వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఈ రోజు మనందరం ఈ శిఖరాగ్ర సదస్సు ప్రకటనను ఆమోదించాం.

మరింత సంఘీభావాన్ని, బలీయమైన భాగస్వామ్యాలను ఆకాంక్షిస్తూ మనందరం స్నేహపూర్వక వైఖరికి కొత్త రూపం ఇవ్వడం ఇలాంటి పత్రాలు, అంకెల కన్నాప్రధానమైనది.

మహోదయులారా

మనందరి ఆశలు, ఆకాంక్షలు, భాగస్వామ్య లక్ష్యాల విస్తృతికి అనుగుణంగా భవిష్యత్తులో ఈ శిఖరాగ్రాన్ని ప్రతీ ఐదేళ్ళకు ఒక సారి నిర్వహించుకోవాలని మనందరం ఒక అంగీకారానికి వచ్చాం.

ఆఫ్రికా ఎప్పుడూ మా దృష్టికి కేంద్రస్థానంగా ఉంటుంది. ఆఫ్రికా దేశాలతో మా సహకారం మరింత లోతుగాను, నిరంతరమైనదిగాను ఉంటుంది. మిమ్మల్నందరినీ ద్వైపాక్షిక పర్యటనల సందర్భంగా మరోసారి చూడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. రానున్న సంవత్సరాల్లో ఆఫ్రికాలోని అన్ని ప్రాంతాలను సందర్శించే అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను.

భారత్కు వచ్చి కొద్ది రోజులు గడిపినందుకు మీకు, మీ ప్రతినిధివర్గాలకు, ఇతర గౌరవనీయ పర్యాటకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ పర్యటన మీకు ఆనందం పంచిందని నేను ఆశిస్తున్నాను. ఢిల్లీకి చక్కని వాతావరణం తీసుకువచ్చినందుకు మరో సారి కృతజ్ఞతలు. కాప్ 21, సోలార్ అలయెన్స్ సమావేశాల సందర్భంగా మీ అందరినీ మరో సారి పారిస్లో కలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను.

ఈ శిఖరాగ్రం విజయవంతం చేసినందుకు నా మంత్రివర్గ సహచరులు, అధికారులు , ఢిల్లీ నగర యంత్రాంగం, ప్రజలు అందరికీ కృతజ్ఞతలు.

ఈ సమావేశం మనందరి భాగస్వామ్యాలకు కొత్త శక్తిని అందించింది. భవిష్యత్తు పట్ల సరికొత్త విశ్వాసం నింపింది.

మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. ధన్యవాదాలు.