విశాఖపట్నం, ముంబై నగరాల్లోని ‘హెచ్‌పిసిఎల్’ రిఫైనరీల అద్భుత భౌతిక పనితీరుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన విశేషాలను కేంద్ర పెట్రోలియం-సహజవాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి వరుస ట్వీట్ల ద్వారా ప్రజలతో పంచుకున్నారు. దేశంలోని పౌరులకు సరసమైన ధరతో ఇంధన సౌలభ్యం కల్పించడంలో ‘హెచ్‌పిసిఎల్’ తన కర్తవ్యాన్ని మించి బాధ్యతలు నిర్వర్తిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రెండు నగరాల్లోని రిఫైనరీలు 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో 4.96 ‘ఎంఎంటి’ మేర ముడిచమురు శుద్ధి ద్వారా 113 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
ఈ అంశాలపై కేంద్ర మంత్రి ట్వీట్‌కు స్పందిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిన సందేశంలో:
“ఇంధన రంగానికి ఇదెంతో సంతోషం కలిగించే సమాచారం” అని పేర్కొన్నారు.
Good news for the energy sector. https://t.co/LSHgW7EHlF
— Narendra Modi (@narendramodi) May 16, 2023
*****
DS/ST
Good news for the energy sector. https://t.co/LSHgW7EHlF
— Narendra Modi (@narendramodi) May 16, 2023