Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబై తాజ్‌మహల్‌ ప్యాలెస్లో ‘ఎస్‌సిఒ’ చిరుధాన్య ఆహారోత్సవం: ప్రధానమంత్రి ప్రశంస


   ముంబైలోని తాజ్‌మహల్‌ ప్యాలెస్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) చిరుధాన్య ఆహారోత్సవం నిర్వహించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్థానిక ఎంపీ శ్రీ మనోజ్‌ కొటక్‌ ఈ ఉత్సవం గురించి ట్వీట్‌ చేశారు. ఈ వేడుకల నేపథ్యంలో జల్‌గావ్‌ జొన్న, నాగ్‌పూర్‌ సజ్జ, ఔరంగాబాద్‌ రాగి వంటి చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారపదార్థాలు తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్లో కొలువుతీరాయని ఆయన పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“శ్రీ అన్న’కు విశేష ప్రాచుర్యం కల్పించే దిశగా కృషిలో ఈ ఉత్సవాల నిర్వహణ ప్రశంసనీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS