Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిశన్ దివ్యాస్త్ర ను ప్రశంసించిన ప్రధాన మంత్రి; ఇది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్   రీ-ఎంట్రీ వెహికిల్ (ఎమ్ఐఆర్‌వి) ని జోడిస్తూ దేశీయం గా అభివృద్ధిపరచినటువంటి అగ్ని-5 క్షిపణి తాలూకు తొలి ప్రయోగ పరీక్ష


‘మిశన్ దివ్యాస్త్ర’ కు గాను డిఆర్‌డిఒ శాస్త్రవేత్తల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికిల్ (ఎమ్ఐఆర్‌వి) సాంకేతిక పరిజ్ఞానాన్ని జత పరచి దేశీయం గా అభివృద్ధి చేసినటువంటి అగ్ని-5 క్షిపణి తాలూకు మొట్టమొదటి ప్రయోగ పరీక్ష యే మిశన్ దివ్యాస్త్ర.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో –

‘‘మిశన్ దివ్యాస్త్ర కు గాను మన డిఆర్‌డిఒ శాస్త్రవేత్తల ను చూస్తే గర్వం గా ఉంది; ఈ మిశన్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికిల్ (ఎమ్ఐఆర్‌వి) సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పూర్తి దేశీయం గా అభివృద్ధిపరచినటువంటి అగ్ని-5 క్షిపణి యొక్క ప్రప్రథమ ప్రయోగ పరీక్ష’’ అని పేర్కొన్నారు.