Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మా దేశం లో పెట్టుబడి పెట్టడం కోసం ప్రపంచ దేశాల ను మేం ఆహ్వానిస్తున్నాం. భారతదేశం నిరుత్సాహ పరచదు: ప్రధాన మంత్రి


భారతదేశాన్ని పెట్టుబడి కి గమ్యస్థానం అనే విషయం లో భారతదేశాన్ని గురించి నవ పారిశ్రామికవేత్తల లో వ్యాప్తి చెందుతున్నటువంటి ఆశావాదాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అంగీకరించారు.

 

రచయిత మరియు నవ పారిశ్రామికవేత్త శ్రీ బాలాజీ.ఎస్ భారతదేశాన్ని గురించి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక అభిప్రాయం లో, భారతదేశం ప్రాచీన నాగరకత కలిగిన ఒక దేశం కావడం తో పాటు గా ఒక స్టార్ట్-అప్ ప్రధానమైన దేశం అని, భారతదేశం లో గల సామర్థ్యాల ను గురించి వివరించారు.

 

ప్రధాన మంత్రి ఆయన కు ప్రత్యుత్తరాన్ని ఇస్తూ, ఎక్స్ మాధ్యం లో –

‘‘మీ యొక్క ఆశావాదం నాకు నచ్చింది. మరి ఇక్కడ నేను మరొక్క మాట ను కూడా చెప్పదలచాను; అది ఏమిటి అంటే నూతన ఆవిష్కరణ ల విషయాని కి వస్తే భారతదేశం లో ప్రజలు మార్గదర్శకులు మరియు అగ్రగాములు అనేదే.

 

మేం మా దేశం లో పెట్టుబడి పెట్టవలసింది గా ప్రపంచ దేశాల ను ఆహ్వానిస్తున్నాం. భారతదేశం నిరుత్సాహాని కి గురి చేయబోదు.’’ అని పేర్కొన్నారు.