శ్రేష్ఠుడు, నా మిత్రుడు అధ్యక్షుడు శ్రీ సోలిహ్,
మహిళలు మరియు సజ్జనులారా,
నేను రెండో సారి ప్రధాన మంత్రి ని అయిన అనంతరం నా తొలి విదేశీ పర్యటన కు అందమైన దేశం అయినటువంటి మీ మాల్దీవ్స్ కే రావడం నాకు దక్కిన ఒక విశేష అధికారం. ఇందుకుగాను నేను సంతోషిస్తున్నాను. మీ వంటి సన్నిహిత మిత్రుడి ని కలుసుకొనే అవకాశం మరొక సారి లభించడం మరింత ఎక్కువ సంతోషాన్ని అందిస్తోంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరియు మీ యొక్క అద్భుతమైన ఆతిథ్యానికి మాల్దీవ్స్ ప్రభుత్వాని కి, మీకు నా తరఫున మరియు నా బృందం తరఫున ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను. కొద్ది రోజుల క్రితం ఈద్ పండుగ ను మన దేశాలు ఆనందోల్లాసాల తో జరుపుకొన్నాయి. ఆ పర్వదినం యొక్క కాంతి మన పౌరుల జీవితాల లో ఎల్లప్పటికీ ప్రకాశిస్తూవుండాలి అని నేను అభిలషిస్తున్నాను.
ఎక్స్‌లెన్సీ,
ఈ రోజు న మాల్దీవ్స్ లో అత్యున్నత గౌరవాన్ని కట్టబెట్టి నన్ను ఆదరించడం ద్వారా మీరు ఒక్క నన్ను మాత్రమే సత్కరించడం కాకుండా యావత్తు భారతదేశాన్ని కూడా సమ్మానించారు. ‘ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజ్జుద్దీన్’ గౌరవం నాకు సంతోషాన్ని ఇవ్వడం తో పాటు గర్వకారకమైనటువంటి అంశం కూడాను. ఇది నాకు ఒక ఆదరణ మాత్రమే కాదు, ఉభయ దేశాల మధ్య ఉన్న మైత్రి కి మరియు సన్నిహిత సంబంధాల కు ఒక గర్వకారకమైనటువంటి అంశం. దీని ని భారతీయుల పక్షాన నేను ఎంతో వినమ్రత తో, కృతజ్ఞత తో స్వీకరిస్తున్నాను. మన రెండు దేశాలు వేలాది సంవత్సరాల తరబడి హిందూ మహాసముద్ర కెరటాల తో పెనవేయబడినటువంటి సన్నిహితమైన, చారిత్రకమైన, సాంస్కృతికమైన సంబంధాల ను కలిగివున్నాయి. ఈ అచంచల మైత్రి కష్టకాలం లో సైతం ఒక మార్గదర్శి గా ఉండింది. 1988వ సంవత్సరం లో జరిగిన విదేశీ ముట్టడి కావచ్చు, లేదా ఒక సునామీ వంటి ప్రాకృతిక విపత్తు కావచ్చు, లేదా ఇటీవలి త్రాగు నీటి ఎద్దడి కావచ్చు.. భారతదేశం సదా మాల్దీవ్స్ వెన్నంటి నిలుస్తోంది. అలాగే, మొట్టమొదట గా సహాయాన్ని అందించడం కోసం ఎల్లవేళల ముందంజ వేస్తూ వచ్చింది.
మిత్రులారా,
భారతదేశం లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల లో మరియు మాల్దీవ్స్ లో జరిగిన మజ్‌లిస్ ఎన్నికల లో వెలువడిన ప్రజా తీర్పు ద్వారా స్పష్టం అవుతున్న విషయం ఏమిటి అంటే అది మన ఇరు దేశాల లో ప్రజలు స్థిరత్వాన్ని మరియు అభివృద్ధి ని కోరుకున్నారు అన్నదే. దీని ని బట్టి చూస్తే ప్రజలు కేంద్ర బిందువు గా ఉండేటటువంటి మరియు అందరినీ కలుపుకుపోయేటటువంటి అభివృద్ధి, అలాగే సుపరిపాలన కోసం మన బాధ్యత మరింత ముఖ్యమైందన్న సంగతి కూడా స్పష్టం అయింది.
అధ్యక్షుడు శ్రీ సోలిహ్ తో కొద్దిసేపటి క్రితం నేను ఎంతో సమగ్రమైనటువంటి మరియు ఉపయోగకరమైనటువంటి చర్చల లో పాలుపంచుకొన్నాను. పరస్పర ప్రయోజనాలు ముడిపడినటువంటి ప్రాంతీయ అంశాలను, ప్రపంచ అంశాల ను మరియు మన ద్వైపాక్షిక సహకారాన్ని మేము సమీక్షించాము. మన భాగస్వామ్యం రానున్న కాలం లో ఏ దిశ గా సాగా లో అనే అంశం పైన మేము సంపూర్ణ అంగీకారాని కి వచ్చాము.
అధ్యక్షుడు శ్రీ సోలిహ్, మీరు పదవీ బాధ్యతల ను స్వీకరించిన నాటి నుండి ద్వైపాక్షిక సహకారం యొక్క దిశ లో మరియు వేగం లో క్రాంతికారి పరివర్తన చోటు చేసుకొంది. 2018వ సంవత్సరం డిసెంబరు నెల లో మీరు భారతదేశాన్ని సందర్శించిన కాలం లో తీసుకొన్న నిర్ణయాల ను ఏకోన్ముఖంగాను, సకాలం లోను అమలుపరచడం జరుగుతోంది.
మిత్రులారా,
అధ్యక్షడు శ్రీ సోలిహ్ భారతదేశాన్ని సందర్శించిన కాలం లో 1.4 బిలియన్ డాలర్ల ఫైనాన్షియల్ ప్యాకేజి ని ప్రకటించి మాల్దీవ్స్ యొక్క తక్షణ ఆర్థిక అవసరాల ను తీర్చడం జరిగింది. దీనితో పాటు సామాజికం గా ప్రభావాన్ని ప్రసరించే అనేక నూతన పథకాల ను ప్రారంభించడమైంది. 800 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ లో భాగం గా అభివృద్ధి పనుల కు సరిక్రొత్త మార్గాల ను సైతం తెరవడం జరిగింది.
భారతదేశాని కి , మాల్దీవ్స్ కు మధ్య అభివృద్ధియుత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం మేము మాల్దీవ్స్ సామాన్య పౌరుల కు లబ్ధి ని చేకూర్చే పథకాల పై శ్రద్ధ తీసుకొన్నాము.
ఈ రోజు న మన ద్వైపాక్షిక సహకారం అనేది మాల్దీవ్స్ లో సాధారణ జన జీవనం లోని ప్రతి ఒక్క పార్శ్వాన్ని స్పర్శిస్తోంది.
● వివిధ దీవుల లో నీరు మరియు పారిశుధ్య సంబంధ ఏర్పాట్లు;
● చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల కు చాలినంత ఆర్థిక సహాయం;
● నౌకాశ్రయాల అభివృద్ధి;
● సమావేశ కేంద్రాలు మరియు సముదాయ కేంద్రాల నిర్మాణం;
● క్రికెట్ స్టేడియమ్ యొక్క నిర్మాణం;
● అత్యవసర వైద్య సేవలు;
● ఆంబ్యులాన్స్ సేవ;
● కోస్తా తీర రక్షణ కు పూచీ పడడం;
● అవుట్ డోర్ ఫిట్‌నెస్ ఇక్విప్‌మెంట్ ను సమకూర్చడం;
● డ్రగ్ డిటాక్స్ సెంటర్;
● విద్యార్థుల ను రేవు దాటించడం;
● వ్యవసాయం మరియు మత్స్య పరిశ్రమ;
● పర్యటన రంగం మరియు నవీకరణ యోగ్య శక్తి రంగం.
భారతదేశ సహకారం ద్వారా ఈ తరహా ప్రాజెక్టులు అనేకం మాల్దీవ్స్ ప్రజల కు నేరు ప్రయోజనాన్ని అందజేస్తున్నాయి.
అద్దు ప్రాంతం లోని చారిత్రక ఫ్రైడే మాస్క్ లో మౌలిక సదుపాయాల విస్తరణ కు మరియు ప్రార్థనాలయం సంరక్షణ కు సహాయాన్ని అందించేందుకు కూడా మేము అంగీకరించాము. రెండు దేశాల పౌరుల మధ్య సంధానాన్ని పెంపొందించడం కోసం మేము భారతదేశం లోని కోచి కి మరియు మాల్దీవ్స్ లోని మాలె, ఇంకా కుల్‌హుధుఫుషి లకు మధ్య ఒక ఫెర్ రీ సర్వీసు ను ఆరంభించడాని కి సైతం అంగీకారం తెలిపాం. మాల్దీవ్స్ లో రూపే కార్డు ను విడుదల చేయడం భారతదేశ యాత్రికుల సంఖ్య ను పెంచే చర్య కానుంది. ఈ విషయం లో అతి త్వరలో మేము ఒక నిర్ణయాన్ని తీసుకొంటాము. మన రక్షణ రంగ సహకారాన్ని పటిష్టపరచుకోవడం పై కూడా చర్చ జరిగింది. ఈ రోజు న మేము మాల్దీవ్స్ రక్షణ బలగాల కు సమష్టి శిక్షణ కేంద్రాన్ని మరియు రేడార్ సిస్టమ్ ఆఫ్ కోస్టల్ సర్ వేలన్స్ ను సంయుక్తం గా ప్రారంభించాము. ఇది మాల్దీవ్స్ యొక్క సముద్ర తీర భద్రత ను బలవత్తరం చేయగలుగుతుంది. మాల్దీవ్స్ తో సంబంధాల కు భారతదేశం అత్యంత ప్రాముఖ్యాన్ని కట్టబెడుతోంది. మేము ఒకరి తో మరొకరం గాఢమైనటువంటి మరియు దృఢమైనటువంటి భాగస్వామ్యాన్ని వర్ధిల్లజేసుకోవాలనుకొంటున్నాం. సమృద్ధమైనటు వంటి, ప్రజాస్వామికమైనటు వంటి మరియు శాంతియుతమైనటు వంటి మాల్దీవ్స్ ఆవిష్కరణ యావత్తు ప్రాంతాని కి లబ్ధి ని కలిగిస్తుంది. మాల్దీవ్స్ కు సాధ్యమైన అన్ని రకాలుగా సహాయం చేయడాని కి భారతదేశం ఎల్లప్పుడూ కంకణం కట్టుకొని ఉంటుందని నేను పునరుద్ఘాటించ దలచుకొన్నాను. అధ్యక్షుల వారి కి మరియు మాల్దీవ్స్ ప్రజల కు వారు అందించిన ఆత్మీయ ఆతిథ్యాని కి గాను నేను మరొక్కమారు ధన్యవాదాలు పలుకుతున్నాను. ఇండో-మాల్దీవ్స్ మైత్రి చిర కాలం వర్ధిల్లుగాక.
DiveeRajjeAiyegeRahmethreikhanAbadah
మీకు ఇవే నా ధన్యవాదాలు.
PM @narendramodi is addressing a joint press meet with President @ibusolih. https://t.co/qCCTwPCqw4
— PMO India (@PMOIndia) June 8, 2019