Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మార్చి 7, 8 లలో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్‌తో పాటు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 7, 8 లలో కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీదమన్దీవ్ తోపాటు గుజరాత్‌లో పర్యటించనున్నారుఆయన మార్చి 7వ తేదీన మధ్యాహ్నం సుమారు గంటల వేళ సిల్‌వాసాకు చేరుకొని నమో ఆసుపత్రి ఒకటో దశ (NAMO Hospital)ను ప్రారంభిస్తారుమధ్యాహ్నం దాదాపు గంటల 45 నిమిషాలకుసిల్‌వాసాలో కేంద్రపాలిత ప్రాంతానికి ఉద్దేశించిన రూ. 2580 కోట్లకు పైగా ఖర్చయ్యే వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలుశంకుస్థాపన చేస్తారుదీని తరువాత ఆయన సూరత్‌కు వెళ్తారుఆయన సాయంత్రం సుమారు గంటలకు సూరత్ ఆహార భద్రత విస్తృత ప్రచార ఉద్యమాన్ని ప్రారంభిస్తారుమార్చి 8న ప్రధాని నవ్‌సారీకి వెళ్తారుఉదయం దాదాపు 11 గంటల 30 నిమిషాలకు లఖ్‌పతి దీదీలతో (లక్షాధికారి సోదరీమణులుభేటీ అయ్యి వారితో మాట్లాడతారుతరువాత ఒక సార్వజనిక కార్యక్రమంలో పాల్గొంటారుఈ సందర్భంగా వివిధ పథకాలను ప్రారంభించనున్నారు.  

దాద్రానగర్ హవేలీదమన్దీవ్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రధాని పర్యటన

దేశంలో నలు మూలలా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రోత్సహించాలన్న అంశానికి ప్రధాని అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నారుదీనికి అనుగుణంగాఆయన సిల్‌వాసాలో నమో ఆసుపత్రి (ఒకటో దశ)ను ప్రారంభించనున్నారుమొత్తం రూ.460 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 450 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రి ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ సేవలను చాలా వరకు బలోపేతం చేయనుందిఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేకించి గిరిజన సముదాయాల వారికి ఈ ఆసుపత్రి అత్యాధునిక చికిత్స సేవలను అందించనుంది.   

కేంద్రపాలిత ప్రాంతానికి ఉద్దేశించిన రూ.2580 కోట్లకు పైగా ఖర్చయ్యే వివిధ అభివృద్ధి పథకాలను ప్రధానమంత్రి ప్రారంభోత్సవంతోపాటు శంకుస్థాపనలు చేస్తారుఈ పథకాల్లో వివిధ గ్రామీణ రహదారులుఇతరత్రా రహదారి సంబంధిత మౌలిక సదుపాయాలుపాఠశాలలుఆరోగ్యంవెల్‌నెస్ కేంద్రాలుపంచాయతీపరిపాలన భవనాలుఆంగన్‌వాడీ కేంద్రాలునీటి సరఫరామురుగు నీటి పారుదల సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన తదితర పథకాలున్నాయిఈ ప్రాంతంలో అనుసంధానాన్ని మెరుగుపరచడంపారిశ్రామిక ప్రగతిపర్యటన రంగాల్ని ప్రోత్సహించడంఉద్యోగ అవకాశాలను కల్పించడంతోపాటు ప్రజాసంక్షేమంతో ముడిపడ్డ కార్యక్రమాలకు ఊతాన్ని ఇవ్వడం.. ఇదీ ఈ పథకాల లక్ష్యం.

ప్రధానమంత్రి రోజ్‌గార్ మేళాలో భాగంగా నియామక పత్రాలను అందజేస్తారుఅలాగే ఆయన పీఎం ఆవాస్ యోజన – పట్టణగిర్ ఆదర్శ్ ఆజీవిక యోజనసిల్వన్ దీదీ పథకం.. వీటి లబ్ధిదారులకు ప్రయోజనాలను ప్రదానం చేస్తారు.

గిర్ ఆదర్శ్ ఆజీవిక యోజన ఉద్దేశం ఈ ప్రాంతానికి చెందిన షెడ్యూల్డు కులాలు (ఎస్‌సీలు), షెడ్యూల్డు తెగలు (ఎస్‌టీలు), ఇతర వెనుకవడిన వర్గాలు (ఓబీసీలు), అల్పసంఖ్యాక వర్గాలతోపాటు దివ్యాంగజనులు.. ఈ వర్గాల మహిళల కోసం చిన్న డెయిరీ ఫారాలను ఏర్పాటు చేసివారి జీవనంలో సామాజికంగాఆర్థికంగా మార్పును తీసుకువచ్చి వారు ఆర్థిక సాధికారితను సంపాదించుకొనేటట్లు చూడడంసిల్వన్ దీదీ పథకం మహిళా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటానికి ఉద్దేశించిందిఈ బళ్లకు పీఎం స్వనిధి (PM SVANIDHI) పథకం నుంచి ఆర్థిక సహాయాన్ని సమకూరుస్తారు.

గుజరాత్‌లో ప్రధాని

ప్రధానమంత్రి మార్చి 7సూరత్ లోని లింబాయత్‌లో సూరత్ ఆహార భద్రతపై విస్తృత ప్రచార ఉద్యమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారుఅంతేకాకుండా 2.3 లక్షల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రయోజనాలను కూడా ఆయన ప్రదానం చేస్తారు.

ప్రభుత్వ వివిధ కార్యకలాపాలకు మహిళా సాధికారత ముఖ్య ఆధారంగా ఉంటోందిప్రధాని దార్శనికత నుంచి ప్రేరణను పొందిమహిళల సర్వతోముఖ అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందిదీనికి అనుగుణంగామార్చి నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగానవ్‌సారి జిల్లాలో వాంసీ బోర్‌సీ గ్రామంలో ఏర్పాటైన లఖ్‌పతీ దీదీ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారులఖ్‌పతి దీదీలతో ఆయన మాట్లాడతారులఖ్‌పతి దీదీలుగా ఎదిగిన అయిదుగురికి ఆయన లఖ్‌పతి దీదీ ధ్రువపత్రాలను అందజేసివారిని సన్మానిస్తారు.

ప్రధాని గుజరాత్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘జిసఫల్’ (గుజరాత్ స్కీమ్ ఫర్ అంత్యోదయ ఫేమిలీస్ ఫర్ ఆగ్మెంటింగ్ లైవ్లీహుడ్స్– జిసఫల్)తోపాటు ‘జిమైత్రి’ (గుజరాత్ మెంటర్‌షిప్ అండ్ యాక్సెలరేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ రూరల్ ఇన్‌కమ్..జీమైత్రికార్యక్రమాలను ప్రారంభిస్తారు.

గ్రామీణ ప్రాంతాల వారికి బతుకుతెరువుకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరచే దిశగా కృషి చేస్తున్న అంకుర సంస్థలకు ‘జిమైత్రి’ పథకంలో భాగంగా ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు ఆ సంస్థలకు కావలసిన సహకారాన్ని కూడా అందజేయనున్నారు.

గుజరాత్‌లోని రెండు ఆకాంక్షాత్మక జిల్లాల్లోని 13 ఆకాంక్షాత్మక బ్లాకులలో అంత్యోదయ కుటుంబాలకు చెందిన స్వయంసహాయ బృందాల (ఎస్‌హెచ్‌జీ)తో అనుబంధం కలిగి ఉన్న మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండావారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వృద్ధిలోకి వచ్చేందుకు కావలసిన శిక్షణను కూడా ‘జిసఫల్’ అందిస్తుంది.  

 

***