Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మారిషస్ ప్రధానితో సమావేశమయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

మారిషస్ ప్రధానితో సమావేశమయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మారిషస్ ప్రధాన మంత్రి శ్రీ ప్రవింద్ కుమార్ జుగ్నౌత్ తో భేటీ అయ్యారు. జి20 సదస్సులో పాల్గొనేందుకు జుగ్నౌత్ భారత్ వచ్చారు.

‘ప్రధాని @KumarJugnauth, నేను చాలా మంచి సమావేశం నిర్వహించాం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత్-మారిషస్ సంబంధాలకు ఇది ప్రత్యేకమైన సంవత్సరం. ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఫిన్ టెక్, కల్చర్ తదితర రంగాల్లో సహకారంపై చర్చించాము . గ్లోబల్ సౌత్ గొంతుకను మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించాము” ప్రధాన మంత్రి  ఎక్స్ లో పోస్ట్ చేశారు

”భారత విజన్ సాగర్ లో కీలక భాగస్వామి అయిన మారిషస్ ప్రధాని @KumarJugnauth తో ప్రధాని @narendramodi సమావేశమయ్యారు. ఈ ఏడాది 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత్-మారిషస్ ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా పెరిగాయని ఇరువురు నేతలు ఉత్సాహంగా అంగీకరించారు” అని పి ఎం ఒ కూడా ఎక్స్ లో పోస్ట్ చేసింది.

******