Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మారిషస్ ప్రధానిగా ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ నవీన్ రామ్‌గూలంకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందనలు


మారిషస్ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి ప్రధానమంత్రిగా ఎన్నికైన డాక్టర్ నవీన్ రామ్‌గూలంకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 ‘‘ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన నా స్నేహితుడు డాక్టర్ రామ్‌గూలంకు హృదయ పూర్వక అభినందనలు తెలిపి ఆయనతో మాట్లాడానుమారిషస్‌ను నడిపించడంలో ఆయన విజయం సాధించాలని కోరుకున్నానుభారత్‌ను సందర్శించాలని ఆహ్వానించానుమా ప్రత్యేకమైనఅపూర్వమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా సమష్టిగా పని చేసేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో శ్రీ మోదీ తెలిపారు.

*****

MJPS/SR