Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మారిషస్ ప్రధానమంత్రి తో చర్చలు జరిపిన – భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మారిషస్ ప్రధానమంత్రి తో చర్చలు జరిపిన – భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మారిష‌స్ ప్ర‌ధాన మంత్రి శ్రీ ప్ర‌వింద్ కుమార్ జుగ్‌ నాథ్‌ తో చ‌ర్చలు జరిపారు.  ప్రధానమంత్రి మోదీ గుజరాత్ పర్యటన సందర్భంగా ఇరువురు నేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ, “ప్రధానమంత్రి కుమార్ జుగ్ నాథ్ తో ఫలవంతమైన చర్చలు జరిగాయి.  వివిధ రంగాలలో భారతదేశం మరియు మారిషస్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత దృఢంగా కొనసాగించడం గురించి మేము మాట్లాడుకోవడం జరిగింది. అని పేర్కొన్నారు.

****

DS/SKS