Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మారిషస్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఈ రోజు మారిషస్ జాతీయ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మారిషస్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ రోజు నిర్వహించే కార్యక్రమాలతోపాటు వాటిలో పాల్గొనాలని నేను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు. నిన్న జరిగిన కీలక సమావేశాలు, కార్యక్రమాల ముఖ్యాంశాలను కూడా ప్రధాని పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘మారిషస్ ప్రజలకు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు నిర్వహించే కార్యక్రమాలతోపాటు వాటిలో పాల్గొనాలని నేను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను.

నిన్నటి ముఖ్యాంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. వాటిలో కీలక సమావేశాలు, చాలా ప్రధాన కార్యక్రమాలు కలిసి ఉన్నాయి..’’

 

 

***

MJPS/VJ