Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మారిషస్ అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ

మారిషస్ అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ


మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరమ్ బీర్ గోఖూల్ తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టేట్ హౌజ్ లో నేడు భేటీ అయ్యారు.

భారత్మారిషస్ మధ్య ప్రత్యేకసన్నిహిత ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారుఇరు దేశాల మధ్య ఉమ్మడి చరిత్రనుబలమైన ప్రజా సంబంధాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. మారిషస్ జాతీయ దినోత్సవానికి రెండోసారి ముఖ్య అతిథిగా హాజరుకావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అధ్యక్షుడు గోఖూల్ప్రథమ మహిళ వృందా గోఖూల్ కు ఓసీఐ కార్డులను ప్రధానమంత్రి ప్రత్యేకంగా అందజేశారుభారత ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన స్టేట్ హౌస్‌లోని ఆయుర్వేద ఉద్యానవనాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించారుఆయుర్వేదం సహా సాంప్రదాయక వైద్య ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో భారత్ కు మారిషస్ ముఖ్యమైన భాగస్వామి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

చర్చల అనంతరం భారత ప్రధానమంత్రి గౌరవార్థం మారిషస్ అధ్యక్షుడు గోఖూల్ అధికారిక విందు ఏర్పాటు చేశారు.