Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మారిశ‌స్ లో మెట్రో ఎక్స్‌ప్రెస్ మ‌రియు ఇఎన్‌టి హాస్పిట‌ల్ ల సంయుక్త ప్రారంభోత్సవం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు మారిశస్ ప్రధాని మాన్య‌ శ్రీ ప్రవింద్ జగన్నాథ్ నేడు ఒక వీడియో లింక్ ద్వారా మారిశ‌స్ లో ఒక కొత్త ఇఎన్‌టి ఆసుపత్రి ని, మెట్రో ఎక్స్‌ప్రెస్ ను సంయుక్తం గా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ మోదీ మాట్లాడుతూ, మారిశ‌స్ ప్ర‌జ‌ల జీవ‌న నాణ్య‌త ను మ‌రింత గా పెంపొందించ‌డం లో మెట్రో మ‌రియు ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కాలు ప్ర‌ముఖ పాత్ర ను పోషించ‌డం తో పాటు ఉభ‌య దేశాల మధ్య గల స‌న్నిహిత సంబంధాల ను గాఢ‌త‌రం గా కూడా మలచగలుగుతాయన్నారు. నేటి కార్య‌క్ర‌మం హిందూ మహాసముద్రం వెంబడి ఒక వీడియో లింక్ ద్వారా భార‌త‌దేశాని కి మ‌రియు మారిశ‌స్ కు చెందిన నేత‌ల ను చేరువ చేసినటువంటి తొలి కార్య‌క్ర‌మం అని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

చాలా కాలం నుండి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి మెట్రో ఎక్స్‌ప్రెస్ (లైట్ రైల్ ట్రాన్జిట్‌) ప్రాజెక్టు మారిశ‌స్ లో ప‌య‌న‌ గ‌తి తాలూకు ముఖ చిత్రాన్ని స‌మ‌ర్ధ‌వంత‌మైనటువంటి, వేగ‌వంత‌మైన‌టువంటి, ఇంకా ప‌రిశుభ్ర‌మైన‌టువంటి ప్ర‌జా ర‌వాణా మాధ్యమం గా మార్చివేస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు. శ‌క్తి ని ఆదా చేసేట‌టువంటి అధునాత‌న రీతి లో నిర్మిత‌మైన ఇఎన్‌టి ఆసుప‌త్రి మారిశ‌స్ లో నాణ్య‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ లభ్యత ను గ‌ణ‌నీయం గా విస్త‌రించ‌డం తో పాటు మారిశ‌స్ లో ఒక‌టో కాగిత వినియోగ ర‌హిత ఇ-హాస్పిట‌ల్ గా కూడా ప్రజల కు లబ్ధి ని చేకూర్చనుంది.

మారిశ‌స్ లో ఈ కార్య‌క్ర‌మాల‌ కు తోడు ఇత‌ర అభివృద్ధి సహకారపూర్వక ప‌థ‌కాల లో భారతదేశం మద్దతిచ్చినందుకు ప్ర‌ధాని శ్రీ జ‌గ‌న్నాథ్ తన ప్రగాఢ ప్ర‌శంస‌ ను వ్యక్తం చేశారు. ప్ర‌జ‌ల సేవ‌ యే ప్ర‌ధానంగా ఉన్నటువంటి ఈ ప‌థ‌కాలు స‌కాలం లో కార్య‌రూపం దాల్చడం లో తోడ్పాటు ను అందించిన సంబంధిత ప‌క్షాల‌న్నిటి ని కూడాను ఆయ‌న మెచ్చుకొన్నారు.

మారిశ‌స్ లో మూత్రపిండాల సంబంధిత యూనిటు తో పాటు మెడి-క్లినిక్స్‌, ఇంకా ఏరియా హెల్త్ సెంట‌ర్స్ నిర్మాణాని కి గ్రాంటు రూపేణా స‌హాయాన్ని అందించడం ద్వారా తోడ్పడాల‌ని భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ వెల్ల‌డించారు.

ఉభ‌య దేశాల ప్ర‌జ‌ల శ్రేయాని కి మ‌రియు హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతం లోను , ప్ర‌పంచం లోను శాంతి, స‌మృద్ధి ల ప‌రిర‌క్ష‌ణ కు భార‌త‌దేశం, మారిశ‌స్ ల స‌హ‌కారం వృద్ధి చెందుతూ ఉండ‌డాన్ని కూడా నేత‌ లు ఇరువురూ ప్రశంసించారు.