Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మారిశ‌స్ లో మెట్రో ఎక్స్‌ప్రెస్ ను మరియు ఇఎన్‌టి హాస్పిట‌ల్ ను వీడియో లింక్ ద్వారా సంయుక్తం గా ప్రారంభించిన కార్య‌క్ర‌మం లో ప్రధాన మంత్రి ప్ర‌సంగం


రిప‌బ్లిక్ ఆఫ్ మారిశ‌స్ ప్ర‌ధాని మాన్య శ్రీ ప్ర‌వింద్ జ‌గ‌న్నాథ్ గారు, మారిశ‌స్ సీనియ‌ర్ మంత్రులు, ఉన్న‌తాధికారులు, విశిష్ట అతిథులు మ‌రియు మిత్రులారా! న‌మ‌స్కారం, బోం స్వా, శుభ మధ్యాహ్నం!

మారిశ‌స్ లోని మా స్నేహితులు అంద‌రి కి నేను చాలా ఆత్మీయ‌మైనటువంటి శుభాకాంక్ష‌ల‌ ను అందించ‌ద‌ల‌చాను.

ఈ ముఖాముఖి సంభాష‌ణ మ‌న దేశాల‌ కు ఒక ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం గా ఉన్నది.  ఇది మ‌న ఉమ్మ‌డి చ‌రిత్ర‌, వార‌స‌త్వం మ‌రియు స‌హ‌కారం లో ఒక నూత‌న అధ్యాయం గా కూడా ఉంది.  మారిశ‌స్ హిందూ మ‌హాస‌ముద్ర ద్వీప క్రీడ‌ల కు ఆతిథ్యాన్నిచ్చి మరి వాటిలో ఖ్యాతి ని సంపాదించుకొని అప్పుడే ఎంతో కాలం ఏమీ కానేలేదు.

మ‌న రెండు దేశాలు ‘దుర్గ పూజ’ను జ‌రుపుకొంటున్నాయి.  త్వ‌ర‌లోనే దీపావ‌ళి ని కూడా వేడుక గా జ‌రుపుకోనున్నాయి.  ఈ ప‌రిణామాలు మెట్రో ప్రాజెక్టు యొక్క ఒక‌టో ద‌శ ప్రారంభాన్ని మ‌రింత ఉల్లాస‌క‌ర‌మైన కార్య‌క్ర‌మం గా మార్చివేశాయి.

మెట్రో ప‌రిశుభ్ర‌మైనటువంటి, సమర్ధమైనటువంటి సదుపాయం. దీని వల్ల కాలం కూడా ఆదా అవుతుంది. ఇది ఆర్థిక కార్య‌క‌లాపాల‌ కు మరియు పర్యటన రంగాని కి అండ‌ గా నిలుస్తుంది.

ఈ రోజు న ప్రారంభం అవుతున్న మ‌రొక ప‌థ‌కం ఏదంటే- ఓ అత్య‌ధునాత‌నమైన ఓ ఇఎన్‌టి ఆసుప‌త్రి అది.  నాణ్య‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ కు తోడ్పాటు ను అందిస్తుంది ఈ ఆసుపత్రి.  దీని కి శ‌క్తి ని ఆదా చేసే ప‌ద్ధతి లో నిర్మించిన ఒక భ‌వ‌నం అమ‌రింది.  ఇక్క‌డ కాగితం వినియోగాని కి తావులేని రీతి న సేవ‌ల‌ ను అందించ‌డం జ‌రుగుతుంది.

ఈ రెండు ప‌థ‌కాలు మారిశ‌స్ ప్ర‌జ‌ల‌ కు సేవ‌ల‌ ను అందిస్తాయి. ఈ రెండు పథకాలు మారిశ‌స్ యొక్క అభివృద్ధి కి గాను భార‌త‌దేశం ప్ర‌ద‌ర్శిస్తున్నటువంటి బ‌ల‌మైన నిబ‌ద్ధ‌త కు సంకేతం గా ఉన్నాయి.

వేలాది శ్రామికులు రాత్రింబ‌వ‌ళ్ళు ఎండనక వాననక క‌ఠోరం గా శ్ర‌మించి ఈ ప‌థ‌కాల‌ ను పూర్తి చేశారు.

గ‌డ‌చిన శ‌తాబ్దాల కు భిన్నం గా, మేము మా ప్ర‌జ‌ల యొక్క ఉత్త‌మ భ‌విష్య‌త్తు కోసం కృషి చేస్తున్నాము.

మారిశ‌స్ కోసం ఆధునిక మౌలిక స‌దుపాయాల కల్పన కు మ‌రియు సేవ‌ ల క‌ల్ప‌న‌ కు న‌డుం క‌ట్టిన ప్ర‌ధాని శ్రీ ప్ర‌వింద్ జ‌గ‌న్నాథ్ దార్శ‌నిక నాయ‌క‌త్వాన్ని నేను అభినందిస్తున్నాను.  ఈ ప‌థ‌కాలు స‌కాలం లో పూర్తి కావ‌డం లో కీల‌క పాత్ర ను పోషించిన మారిశ‌స్ ప్ర‌భుత్వాని కి మ‌రియు శ్రీ జ‌గ‌న్నాథ్ కు నేను ధ‌న్యవాదాలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ప్ర‌జా హితం ముడిప‌డిన ఈ ప‌థ‌కాలు మ‌రియు ఇత‌ర ప‌థ‌కాల లో మారిశ‌స్ తో భారతదేశం చేయి క‌లపడం మాకు ఎంతో గ‌ర్వం గా ఉంది.

కింద‌టి సంవ‌త్స‌రం లో ఒక సంయుక్త ప‌థ‌కం లో భాగం గా చిన్నపిల్లల కు ఇ-టాబ్లెట్‌ ల‌ను అందించడం జరిగింది.

సుప్రీం కోర్టు కోసం ఒక నూత‌న భ‌వ‌నం, ఇంకా ఒక వేయి గృహాల నిర్మాణ పనులు శ‌ర‌వేగం గా పురోగమిస్తున్నాయి.

ఒక రీన‌ల్ యూనిట్ తో పాటు మెడి-క్లినిక్స్ మరియు ఏరియా హెల్త్ సెంట‌ర్ ల నిర్మాణాని కి ప్ర‌ధాని శ్రీ జ‌గ‌న్నాథ్ సూచ‌న‌ల మేర‌కు భార‌త‌దేశం స‌హాయాన్ని అందిస్తోంద‌ని ప్ర‌క‌టించ‌డం నాకు సంతోషం గా ఉంది.

మిత్రులారా,

మారిశ‌స్ మ‌రియు భార‌త‌దేశం.. ఈ రెండు దేశాలు హుషారైన మ‌రియు వైవిధ్య‌భ‌రిత‌మైన ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ లు.  ఇవి మ‌న ప్రాంతం లోను, ప్ర‌పంచం లోను శాంతి సాధ‌న కు, అలాగే మ‌న ప్ర‌జ‌ల స‌మృద్ధి కి కృషి చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నాయి.

ఒక‌రంటే మ‌రొక‌రి కి మ‌న మ‌ధ్య ఉన్న గౌర‌వం అనేక రూపాల లో వ్య‌క్తం అవుతోంది.

ఈ సంవ‌త్స‌రం లో ప్ర‌ధాని శ్రీ జ‌గ‌న్నాథ్ అత్యంత భారీ స్థాయి లో జ‌రిగిన ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ కార్య‌క్ర‌మాని కి ముఖ్య అతిథి గా విచ్చేశారు.  అంతేకాదు, నా ప్ర‌భుత్వ రెండో ప‌ద‌వీ కాలం ప్రారంభానికి కూడా ఆయ‌న త‌ర‌లి వ‌చ్చారు.

మారిశ‌స్ కు స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత 50వ వార్షికోత్స‌వ సందర్భం లో మా రాష్ట్రప‌తి ని ముఖ్య అతిథి గా రావలసిందిగా ఆహ్వానించారు.  మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి సందర్భం లో మారిశ‌స్ ఆయ‌న స్మృతి కి శ్ర‌ద్ధాంజ‌లి ని ఘ‌టించ‌డమే కాకుండా ఆయ‌న తో ముడిపడిన ప్ర‌త్యేక సంబంధాలను గుర్తు కు తెచ్చుకొంది.

మిత్రులారా,

హిందూ మ‌హాస‌ముద్రం మారిశ‌స్ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య ఒక వంతెన లాగా పనిచేస్తోంది.  సాగ‌ర ఆధారిత ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌న ప్ర‌జ‌ల కు చాలా మహత్వపూర్ణమైంది.

సాగ‌ర సంబంధ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, భ‌ద్ర‌త‌, ఇంకా విప‌త్తు వేళ న‌ష్ట భ‌య త‌గ్గింపు న‌కు చెందిన అన్ని అంశాల లో స‌న్నిహితం గా క‌ల‌సి ప‌ని చేయ‌డం లో ‘‘సెక్యూరిటీ ఎండ్ గ్రోత్ ఫ‌ర్ ఆల్ ఇన్ ద రీజియన్’’- ఎస్ఎజిఎఆర్ యొక్క దార్శ‌నిక‌త మనకు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంది.

కొవలిశ‌న్ ఫ‌ర్ డిజాస్ట‌ర్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్  లో ఒక వ్య‌వ‌స్థాప‌క స‌భ్య‌త్వ దేశం గా చేరుతున్నందుకు మారిశ‌స్ ప్ర‌భుత్వాని కి నేను ధ‌న్య‌వాదాలు తెలియ‌జేయ‌ద‌ల‌చాను.

ఎక్స్‌లెన్సీస్‌,

ప్రపంచ వార‌స‌త్వ ప్ర‌దేశం అయినటువంటి అప్ర‌వాసీ ఘాట్ లో ఒక నెల రోజుల లోపల అప్ర‌వాసీ దివ‌స్ జ‌రుగనుంది.  ఆ కార్య‌క్ర‌మం మ‌న సాహ‌సిక పూర్వికుల పోరాట సఫ‌లత ను చాటి చెప్తుంది.

ఈ పోరాటం తో మారిశ‌స్ కు ఈ శ‌తాబ్దం లో తీపి ఫలితాలు దక్కాయి.

మారిశ‌స్ ప్ర‌జ‌ల మార్గ‌ద‌ర్శ‌క స్ఫూర్తి కి మేము వ‌ంద‌నాన్ని ఆచ‌రిస్తున్నాము.

Vive l’amitié antre l’Inde à Maurice.

भारत और Mauritius मैत्री अमर रहे।

భార‌తదేశం, మారిశ‌స్ ల మైత్రి కల కాలం వ‌ర్థిల్లాలి.

ధ‌న్య‌వాదాలు, అనేకానేక ధ‌న్య‌వాదాలు.