మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
ప్రధాని శ్రీ జగన్నాథ్ భారతదేశం లో అమ్ఫాన్ తుఫాను కారణం గా వాటిల్లిన నష్టాల పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్-19 విశ్వమారి తో పోరాటం లో మారిశస్ ఆరోగ్య రంగ అధికారుల కు సహాయపడేందుకు గాను ‘ఆపరేశన్ సాగర్’ లో భాగం గా 14 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం తో పాటు ఔషధాల ను కూడా భారతదేశ నౌకాదళాని కి చెందిన ‘కేసరి’ ద్వారా పంపించినందుకు ప్రధాన మంత్రి కి శ్రీ జగన్నాథ్ ధన్యవాదాలు తెలిపారు.
మారిశస్ మరియు భారతదేశం లకు చెందిన ప్రజల మధ్య నెలకొన్న ప్రత్యేక సంబంధాల ను ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. ఈ సంక్షోభ కాలం లో తన మిత్ర దేశాల కు తోడ్పాటు ను అందించవలసిన కర్తవ్యాని కి భారతదేశం కట్టుబడి ఉందని కూడా ఆయన అన్నారు.
కోవిడ్-19 ని ఎదుర్కోవడానికి మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ నాయకత్వం లో ప్రభావశీలమైనటువంటి ప్రతిక్రియల ను చేపట్టారు, తత్ఫలితం గా అనేక వారాలు గా ఎటువంటి క్రొత్త కేసులు నమోదు కాలేదు అంటూ ప్రధాన మంత్రి ప్రశంసించారు. మారిశస్ లో అనుసరించిన ఉత్తమమైన అభ్యాసాల ను దస్తావేజు పత్రాల రూపం లో పదిలపరచాలని, తద్ద్వారా ఇతర దేశాల కు, ప్రత్యేకించి ద్వీప దేశాల కు, ఈ కోవ కు చెందిన ఆరోగ్య సంకట కాలాల ను ఎదిరించి పోరాడటం లో తోడ్పాటు లభించగలదని ఆయన సూచించారు.
వివిధ రంగాల లో ఇతోధిక సహకారాన్ని అందించుకోవడం గురించి, దీనిలో భాగం గా మారిశస్ ఆర్థిక రంగాని కి తోడ్పాటు ను అందించడానికి ఉద్దేశించిన చర్యలు సహా ఆయుర్వేదం ద్వారా రోగచికిత్స పద్ధతుల అధ్యయనానికి మారిశస్ యువత ముందంజ వేసేందుకు వీలు కల్పించడం గురించి ఇద్దరు నేత లు చర్చించారు.
మారిశస్ ప్రజల కు మంచి ఆరోగ్యం తో పాటు శ్రేయస్సు ప్రాప్తించాలంటూ ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. అలాగే, ఉభయ దేశాల మధ్య విశిష్టమైనటువంటి ఆత్మీయ సంబంధాలు కొనసాగుతూ ఉండాలని కూడా ఆయన అభిలషించారు.
**
Thank you, Prime Minister @PKJugnauth for our warm conversation today! Congratulations for successfully controlling COVID-19 in Mauritius.
— Narendra Modi (@narendramodi) May 23, 2020
Our people share warm and special ties, based on shared culture and values. Indians will stand by their Mauritian brothers and sisters at this difficult time.
— Narendra Modi (@narendramodi) May 23, 2020