Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మారిశస్ ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించిన శ్రీ ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు


మారిశస్ ప్రధానిగా పదవీబాధ్యతలను స్వీకరించిన శ్రీ ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం టెలిఫోన్ లో మాట్లాడారు. శ్రీ ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ కు శ్రీ మోదీ తన అభినందనలను తెలియజేశారు.

తనతో టెలిఫోన్ లో సంభాషించిన ప్రధాన మంత్రికి శ్రీ జగన్నాథ్ ధన్యవాదాలు తెలిపారు.

భారతదేశం మరియు మారిశస్ ల మధ్య నెలకొన్న విశిష్టమైన మరియు కాలపరీక్షకు తట్టుకొని నిలచిన సంబంధాలను మరింతగా బలోపేతం చేసేందుకు ఉమ్మడిగా కృషి చేద్దామని ప్రధాన మంత్రి శ్రీ మోదీ, ప్రధాని శ్రీ జగన్నాథ్ లు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

వైదొలగుతున్న ప్రధాని శ్రీ అనిరుద్ధ జగన్నాథ్ భారతదేశం మరియు మారిశస్ ల మధ్య మిత్రత్వ బంధాన్ని దృఢతరం చేయడం కోసం అందించిన సేవలను, అలాగే శ్రీ అనిరుద్ధ జగన్నాథ్ యొక్క నాయకత్వాన్ని కూడా ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు.