Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాతృభూమి గౌరవాన్ని, స్వాభిమానాన్ని పరిరక్షించడానికి మన ఆదివాసి సముదాయాలు చాటిన సాటి లేనటువంటి పరాక్రమానికి, వారు చేసిన త్యాగాలకు ప్రతీక యే ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’: ప్రధానమంత్రి


గిరిజన గౌరవ దినోత్సవం (‘జన్ జాతీయ గౌరవ్ దివస్’) సందర్భంగా జాతిని ఉద్దేశించి గౌరవనీయ రాష్ట్రపతి ఇచ్చే ప్రసంగాన్ని వినవల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పౌరులకు ఈ రోజు విజ్ఞ‌ప్తి చేశారు. మాతృభూమి గౌరవాన్ని, స్వాభిమానాన్ని పరిరక్షించడానికి మన ఆదివాసి సముదాయాలు ప్రదర్శించిన సాటిలేని శౌర్యానికి,  వారి గొప్ప త్యాగాలకు ఒక ప్రతీకగా గిరిజన గౌరవ దినోత్సవం నిలుస్తోందని ప్రధాని అభివర్ణించారు.

రాష్ట్రపతి ట్విటర్ హేండిల్ లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ, ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘మాతృభూమి గౌరవాన్ని, మాతృభూమి స్వాభిమానాన్ని పరిరక్షించడానికి మన ఆదివాసి సముదాయాలు ప్రదర్శించిన సాటి లేని శౌర్యం, వారు చేసిన ప్రాణత్యాగాలకు ప్రతీకగా దేశ ప్రజలు జన్ జాతీయ గౌరవ్ దివస్ ను జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా  జాతిని ఉద్దేశించి ఆదరణీయ రాష్ట్రపతి జీ ఇచ్చే ప్రసంగాన్ని తప్పక వినవలసిందిగా దేశ ప్రజలందరికీ నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను..’’