ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకాన్ని దేశ ప్రజల కు అంకితం చేసేందుకు గుర్తు గా న్యూ ఢిల్లీ లో ఒక శాశ్వత జ్యోతి ని నేడు వెలిగించారు. స్మారకం ఆవరణ లోని వివిధ విభాగాల ను ఆయన సందర్శించారు.
అంత కిత్రం, మాజీ సైనికోద్యోగులు నిర్వహించిన ఒక విశాల ర్యాలీ ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, లక్షలాది జవానుల పరాక్రమం మరియు అంకిత భావం ఫలితం గానే భారతీయ సైన్యం ఈ రోజున ప్రపంచం లో కెల్లా అత్యంత శక్తివంతమైనదిగా పరిగణింప బడుతోందన్నారు.
అటు శత్రువు లకు వ్యతిరేకం గానే కాక ఇటు ప్రకృతి విపత్తుల కు కూడా ఎదురొడ్డటం కోసం మన సైనికులు రక్షణ వలయం లో ముందు వరుస లో నిలబడుతున్నారని ప్రధాన మంత్రి అన్నారు.
పుల్‌వామా లో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటన లో సిఆర్‌పిఎఫ్ జవానులు ప్రాణ త్యాగం చేయడాన్ని ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు. భారతదేశాన్ని రక్షిస్తూ నేలకొరిగిన అమరవీరులందరికీ ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ప్రస్తుతం ‘న్యూ ఇండియా’ ప్రపంచ వ్యాప్తం గా తన స్థాయి ని పెంచుకొంటోందని, మరి దీనికి భారతదేశం యొక్క సాయుధ బలగాలే కారణమని ఆయన అన్నారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని ఈ రోజున దేశ ప్రజల కు అంకితం చేస్తుండటం పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సైనికుల కు మరియు మాజీ సైనికోద్యోగుల కు ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ (ఒఆర్ఒపి) ని ఇస్తామన్న తన ప్రతిజ్ఞ ను సైతం నెరవేర్చుకొందని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఒఆర్ఒపి పర్యవసానం గా పింఛన్ లో 40 శాతం వరకు పెరుగుదల చోటు చేసుకొందని, అలాగే సైనికుల జీతాల లో 2014వ సంవత్సరం తో పోల్చి చూస్తే 55 శాతం వరకు పెరుగుదల ఉందని ఆయన చెప్పారు.
ఒక సూపర్ స్పెశాలిటీ హాస్పిటల్ ను నెలకొల్పాలనే డిమాండు ఉంటూ వచ్చిందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఆ కోవ కు చెందిన మూడు సూపర్ స్పెశాలిటీ హాస్పిటల్స్ ను స్థాపించడం జరుగుతుందని ఆయన ప్రకటించారు.
సాయుధ దళాల పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి కి సంబంధించిన మరికొన్ని ఉదాహరణల ను ప్రధాన మంత్రి పేర్కొంటూ, జవానుల నూతన ఆవిష్కరణల కు సైనిక దినోత్సవం, నావిక దళ దినోత్సవం, ఇంకా వైమానిక దళ దినోత్సవాల లో ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతోందన్నారు. 2017వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన సాహస పురస్కారాల పోర్టల్ ను ప్రారంభించినట్లు కూడా ఆయన తెలిపారు. ప్రస్తుతం మహిళలు పోరాట విమానాల పైలట్లు గా కూడా అవకాశాన్ని చేజిక్కించుకున్నారని ఆయన అన్నారు. శార్ట్ సర్వీస్ కమిశన్ లోని మహిళా అధికారుల కు వారి పురుష అధికారుల తో సమానంగా పర్మనెంట్ కమిశన్ కై అవకాశాల ను ఇవ్వడం జరుగుతోందని ఆయన చెప్పారు.
రక్షణ రంగ కొనుగోళ్ళ కు సంబంధించిన యావత్ విధి విధానం లో మార్పు కు నాంది పలికినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. పారదర్శకత్వం మరియు సమాన అవకాశాల కల్పన ప్రభుత్వం వైఖరి లో ముఖ్యాంశాలు గా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలు చేపట్టిన 70 ప్రధాన కార్యక్రమాల లో దాదాపు 50 కార్యక్రమాల లో భారతీయ సైన్యం పాలుపంచుకొందని, అలాగే సుమారు 2 లక్షల మంది జవానులు ఈ విన్యాసాల లో భాగాన్ని పంచుకొన్నారని ప్రధాన మంత్రి అన్నారు. భారతీయ నౌకా దళం 2016వ సంవత్సరం లో నిర్వహించినటువంటి ఇంటర్ నేశనల్ ఫ్లీట్ రివ్యూ లో 50 దేశాల కు చెందిన నావికా దళాలు పాల్గొన్నాయని ఆయన చెప్పారు. మన సాయుధ దళాలు మిత్ర దేశాల కు చెందిన సాయుధ దళాల తో కలసి ప్రతి ఏటా సగటు న పది పెద్ద సంయుక్త విన్యాసాల ను నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
హిందూ మహా సముద్రంలో సముద్రపు దోపిడీ లు బాగా తగ్గాయంటే అందులో భారతదేశం యొక్క సైనిక శక్తి, మరి అలాగే మన అంతర్జాతీయ భాగస్వామ్యాల పాత్ర చాలా వరకు ఉందని ఆయన అన్నారు. 1.86 లక్షల బులిట్ ప్రూఫ్ జాకెట్ లు కావాలని భారతీయ సైన్యం చాలా కాలం గా డిమాండు చేస్తూ వచ్చిందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. గడచిన నాలుగున్నర సంవత్సరాల లో కేంద్ర ప్రభుత్వం 2.30 లక్షల బులిట్ ప్రూఫ్ జాకెట్ లను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం భారతీయ సైన్యాని కి ఆధునిక యుద్ధ విమానాన్ని, హెలికోప్టర్ లను , జలాంతర్గాముల ను, నౌకల ను, ఇంకా ఆయుధ సామగ్రి ని సమకూర్చుతోందని ఆయన అన్నారు. చాలా కాలం పాటు నిలచిపోయినటువంటి నిర్ణయాల ను దేశ హితాన్ని దృష్టి లో పెట్టుకొని తీసుకోవడం జరుగుతోందని ఆయన అన్నారు.
జాతీయ యుద్ధ స్మారకానికి తోడు జాతీయ పోలీసు స్మారకాన్ని కూడా స్థాపించినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. సర్ దార్ పటేల్ గారు, బాబా సాహెబ్ ఆంబేడ్కర్ మరియు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గార్లు సహా మహనీయ జాతీయ నేతల ను కేంద్ర ప్రభుత్వం గౌరవించిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ హితాన్ని సర్వోపరి గా ఎంచుతూ నిర్ణయాల ను తీసుకొంటూ ఉంటుందని ఆయన చెప్పారు.
**
आज मुझे बहुत संतोष है कि थोड़ी देर बाद आपका और देश का, दशकों लंबा इतंज़ार खत्म होने वाला है।
— PMO India (@PMOIndia) February 25, 2019
आज़ादी के सात दशक बाद मां भारती के लिए बलिदान देने वालों की याद में निर्मित राष्ट्रीय समर स्मारक, उन्हें समर्पित किया जाने वाला है: PM
राष्ट्रीय समर स्मारक की मांग कई दशक से निरंतर हो रही थी।
— PMO India (@PMOIndia) February 25, 2019
बीते दशकों में एक-दो बार प्रयास हुए लेकिन कुछ ठोस हो नहीं पाया।
आपके आशीर्वाद से साल 2014 में हमने राष्ट्रीय समर स्मारक बनाने के लिए प्रक्रिया शुरु की और आज तय समय से पहले ही इसका लोकार्पण होने वाला है: PM
बहुत लंबे समय से आपकी मांग थी कि आपके लिए सुपर स्पेशिएलिटी अस्पताल बनाया जाए।
— PMO India (@PMOIndia) February 25, 2019
आज इस ऐतिहासिक अवसर पर मुझे आपको ये बताने का सौभाग्य मिला है कि एक नहीं बल्कि हम ऐसे तीन सुपर स्पेशिएलिटी अस्पताल बनाने जा रहे हैं: PM
देश की सेना को आत्मनिर्भर बनाने की दिशा में हम लगातार काम कर रहे हैं।जिन फैसलों को नामुमकिन समझा जाता था, उन्हें मुमकिन बना रहे हैं.
— PMO India (@PMOIndia) February 25, 2019
हमने रक्षा उत्पादन के पूरे ecosystem में बदलाव की शुरुआत की है। Licensing से Export प्रक्रिया तक, हम पूरे system में पारदर्शिता ला रहे हैं: PM
हमारे प्रयासों में दुनिया के बड़े-बड़े देश हमारे साथ कंधे से कंधा मिलाकर चलना चाहते हैं।
— PMO India (@PMOIndia) February 25, 2019
यही कारण है कि 2016 में हमारे International Fleet Review में 50 देशों की नौसेनाओं ने हिस्सा लिया था।
यही कारण है कि एक के बाद एक देश हमारे साथ रक्षा सहयोग के समझौते करना चाहते हैं: PM
साल 2009 में सेना ने 1 लाख 86 हजार बुलेट प्रूफ जैकेट की मांग की थी।
— PMO India (@PMOIndia) February 25, 2019
2009 से लेकर 2014 तक पाँच साल बीत गए, लेकिन सेना के लिए बुलेटप्रूफ जैकेट नहीं खरीदी गई।
ये हमारी ही सरकार है जिसने बीते साढ़े चार वर्षों में 2 लाख 30 हजार से ज्यादा बुलेट प्रूफ जैकेट खरीदी है: PM
सेना और देश की सुरक्षा को उन लोगों ने अपनी कमाई का साधन बना लिया था।
— PMO India (@PMOIndia) February 25, 2019
शायद शहीदों को याद करके उन्हें कुछ मिल नहीं सकता था, इसलिए उन्हें भुलाना ही उन्हें आसान लगा: PM
बोफोर्स से लेकर हेलीकॉप्टर तक, सारी जांच का एक ही परिवार तक पहुंचना, बहुत कुछ कह जाता है। अब यही लोग पूरी ताकत लगा रहे हैं कि भारत में राफेल विमान न आ पाए।
— PMO India (@PMOIndia) February 25, 2019
अगले कुछ महीनों में जब देश का पहला राफेल, भारत के आसमान में उड़ान भरेगा, तो खुद ही इनकी सारी साजिशों को ध्वस्त कर देगा: PM
सेना के लिए अत्याधुनिक राइफलों को खरीदने और भारत में बनाने का काम भी हमारी सरकार ने ही शुरु किया है। हाल ही में सरकार ने 72 हजार आधुनिक राइफल की खरीद का ऑर्डर दिया है।
— PMO India (@PMOIndia) February 25, 2019
साथ ही हमारी सरकार ने 25 हजार करोड़ रुपए का एम्यूनीशन यानि गोला-बारूद और गोलियां मिशन मोड में खरीदी है: PM
आज देश को राष्ट्रीय समर स्मारक मिलने जा रहा है लेकिन राष्ट्रीय पुलिस मेमोरियल की भी तो यही कहानी थी।
— PMO India (@PMOIndia) February 25, 2019
इस मेमोरियल को बनाने और राष्ट्र को समर्पित करने का सौभाग्य भी हमारी ही सरकार को मिला: PM
करीब ढाई दशक पहले इस स्मारक की फाइल चली थी, बीच में अटल जी की सरकार के समय बात आगे बढ़ी लेकिन उनकी सरकार के जाने के बाद स्थिति फिर जस की तस हो गई: PM
— PMO India (@PMOIndia) February 25, 2019
आज देश का हर फौजी, हर नागरिक ये सवाल पूछ रहा है कि आखिर शहीदों के साथ ये बर्ताव क्यों किया गया?
— PMO India (@PMOIndia) February 25, 2019
देश के लिए खुद को समर्पित करने वाले महानायकों के साथ इस तरह का अन्याय क्यों किया गया?
वो कौन सी वजहें थीं, जिसकी वजह से किसी का ध्यान शहीदों के लिए स्मारक पर नहीं गया?: PM
इंडिया फर्स्ट और फैमिली फर्स्ट का जो अंतर है, वही इसका जवाब है।
— PMO India (@PMOIndia) February 25, 2019
स्कूल से लेकर अस्पताल तक, हाईवे से लेकर एयरपोर्ट तक, स्टेडियम से लेकर अवॉर्ड तक – हर जगह एक ही परिवार का नाम जुड़ा रहता था: PM
मेरा ये स्पष्ट मानना है कि मोदी महत्वपूर्ण नहीं है, बल्कि इस देश की सभ्यता, संस्कृति और इतिहास सबसे ऊपर है।
— PMO India (@PMOIndia) February 25, 2019
मोदी याद रहे न रहे, परंतु इस देश के करोड़ों लोगों के त्याग, तपस्या, समर्पण, वीरता और उनकी शौर्यगाथा अजर-अमर रहनी ही चाहिए: PM