Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్రధాని శ్రీ చౌధరీ చరణ్ సింగ్‌ జయంతి సందర్భంగా స్మరించుకొన్న ప్రధానమంత్రి


పూర్వ ప్రధాని శ్రీ చౌధరీ చరణ్ సింగ్‌ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధాని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘పేదలకు, రైతులకు మంచి జరగాలని కోరుకున్న పూర్వ ప్రధాని ‘భారత్ రత్న’ చౌధరీ చరణ్ సింగ్ జీకి ఆయన జయంతి సందర్భంగా నేను వినమ్రతాపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. దేశం ప్రగతిపథంలో పయనించడం కోసం ఆయన చాటిన అంకితభావం, సేవాభావం ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ ప్రేరణనిస్తూ ఉంటాయి’’.

 

 

***

MJPS/VJ