Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం


మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘అత్యంత విలక్షణ నాయకుల్లో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కోల్పోవడం పట్ల దేశ ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు’’ అని శ్రీ మోదీ అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సాధారణ మూలాల నుంచి వచ్చి ఉన్నతమైన ఆర్థిక వేత్తగా ఎదిగారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసం విస్తృతంగా కృషి చేశారన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

అత్యంత విలక్షణమైన నాయకుల్లో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కోల్పోవడం పట్ల భారత్ తీవ్ర విచారం వ్యక్తంచేస్తోంది. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన ఉన్నతమైన ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థికశాఖ సహా వివిధ ప్రభుత్వ పదవుల్లోనూ సేవలందించిన ఆయన కొన్నేళ్ల పాటు మన ఆర్థిక విధానాలపై బలమైన ముద్ర వేశారు. పార్లమెంటులో ఆయన ప్రసంగాలు కూడా అర్థవంతంగా ఉండేవి. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఆయన విస్తృతంగా కృషిచేశారు.

 

 

“ఆయన ప్రధానమంత్రిగా, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో నేను క్రమం తప్పకుండా మాట్లాడేవాడిని. పరిపాలనకు సంబంధించి వివిధ అంశాలపై మేం విస్తృతంగా చర్చించేవాళ్లం. దార్శనికత, నిగర్వం ఆయనలో స్పష్టంగా కనిపించేవి.

ఈ బాధాకరమైన సమయంలో.. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి, ఆయన మిత్రులకు, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’ 

 

 

 

***

MJPS/VJ